Bollywood Beauty.. ఎవరు ఊహించని విధంగా సడన్ గా ముంబై హీరోయిన్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తుంది. వైసిపి నేతలు, పోలీసులు కలసి తనను చిత్రవధకు గురి చేశారని, దాదాపు 15 రోజులపాటు ఒకే గదిలో ఉంచి నరకం చూపించారు అంటూ ముంబై హీరోయిన్ తాజాగా కన్నీరు మున్నీరు అవుతోంది. అందులో భాగంగానే తాజాగా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరగా ఆమెకు పూర్తి భరోసా ఇస్తామని ప్రకటించింది. దీంతో ఆమె ముంబై నుంచి హుటాహుటిగా నిన్న హైదరాబాదుకు వచ్చేసింది. ఈ క్రమంలోనే శంషాబాద్ దగ్గర ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పలు సంచలన విషయాలు బయట పెట్టింది.
గత ప్రభుత్వం నన్ను ఆట బొమ్మను చేసింది..
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ ఆషా జెత్వానీ (Asha Jethwani). తాజాగా గురువారం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆషా జెత్వానీ మాట్లాడుతూ.. అప్పట్లో నన్ను చిత్రవధకు గురిచేసిన గత ప్రభుత్వ వ్యక్తులపై కేసు వివరాలను, నా వద్ద ఉన్న సాక్షాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అందజేస్తాను. ఇప్పుడున్న ప్రభుత్వం పై నాకు నమ్మకం ఉంది.విజయవాడ పోలీసులు నాతో మాట్లాడారు. ఆన్లైన్లో ఫిర్యాదు కూడా చేశాను. 2014లో నాపై మల్టిపుల్ క్రిమినల్ కేసులు పెట్టి నన్ను గత ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారులు ఆట బొమ్మలా వాడుకున్నారు. చట్ట వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కొంతమంది నన్ను, నా కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేశారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడాలి. ఇకపై ఏ ఒక్కరికి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.
డబ్బుల కోసమే నా వ్యక్తిత్వాన్ని కించపరిచారు.
ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి. నాపై ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఈమధ్య బయట చాలా ప్రశాంతంగా, ధైర్యంగా తిరుగుతున్నారు. వారికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. త్వరలో నేను ప్రభుత్వానికి అందిస్తాను. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను. ముఖ్యంగా కొంతమంది నన్ను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని , నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు.
న్యాయం కోసం పోరాడుతున్నా..
ముందుగా నాకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాను. కచ్చితంగా ఈ ప్రభుత్వం వల్ల నాకు మంచి జరుగుతుందని భావిస్తున్నాను అంటూ తెలిపింది ఆషా జెత్వానీ (Asha jethwani)ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
జెత్వానికి అండగా మహిళలు..
జెత్వానీ విషయంలో మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు యావత్తు ప్రజానీకం తెలుగుదేశం పార్టీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలు నీరాజనాలు పలుకుతున్నారు. అంతేకాదు పోలీసులు ముంబై వెళ్లి మరీ ఆమెను తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా ప్రస్తుత ప్రభుత్వం ఆమెకు న్యాయం చేయబోతుందని అందరూ నమ్ముతున్నారు. మరి ఏ మేరకు ఈమెకు న్యాయం జరుగుతుందో చూడాలి.
View this post on Instagram