Bithiri Sathi.. ప్రముఖ నటుడిగా, కమెడియన్ గా, హీరోగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్న బిత్తిరి సత్తి ఇటీవల భగవత్ గీత పై చేసిన వ్యాఖ్యల కారణంగా వివాదంలో చిక్కుకున్నారు.అయితే తాజాగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తాజాగా ఆయన ఒక మెట్టు దిగివచ్చి క్షమాపణలు చెప్పడమే కాదు తనను అలా చేసినట్టు అందరూ ఒప్పుకుంటే కేసును కూడా ఎదుర్కొంటానంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే తాజాగా హిందువులు, నిరసనకారులు క్షమాపణలు చెప్పాలంటూ వార్తలు వైరల్ చేస్తున్న నేపథ్యంలో బిత్తిరి సత్తి తాజాగా మరో వీడియో రిలీజ్ చేశాడు.
భగవత్ గీత.. క్షమాపణలు చెప్పిన బిత్తిరి సత్తి..
తాజాగా భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఘటనపై సారీ చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు టాలీవుడ్ కమెడియన్ బిత్తిరి సత్తి. సరదాగా తాను చేసిన వీడియోని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఎవరిని కించపరచాలని చేయలేదన్నారు. ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నా అంటూ వీడియో ద్వారా విడుదల చేశారు. అయితే ఇప్పుడు మరొక వీడియో విడుదల చేస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కించపరిచినట్టు అనిపిస్తే కేస్ ఎదుర్కొంటా..
ఆ వీడియోలో బిత్తిరి సత్తి మాట్లాడుతూ.. అందరికీ నమస్తే.. నేను మీ రవికుమార్ కావలి. ఈమధ్య ఒక వీడియోని బాగా వైరల్ చేస్తున్నారు. అందులో నిజం ఏమి లేదు. నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోలు చేస్తూ చిన్నచిన్న షాట్స్ షేర్ చేస్తూ వస్తున్నాను. ఏదో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. భగవద్గీత అంటే నేను కూడా ఆరాధిస్తాను. భగవద్గీత గురించి ప్రచారం చేస్తూ ఉంటాను. నా అభిమానులు, శ్రేయోభిలాషులు నన్ను ప్రేమించిన వాళ్ళు , నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా.. కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం దానిని కచ్చితంగా ఎదుర్కొంటాను. దాదాపు 15 సంవత్సరాలుగా ఇలాంటి కామెడీ నేను చేస్తున్నాను. ఎలా అలాంటివి మనమీద వైరల్ చేయాలనిపించిందో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ధన్యవాదాలు.. ఎప్పటికీ మిమ్మల్ని నవ్వించడానికి, మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అంటూ ఒక వీడియో షేర్ చేశారు బిత్తిరి సత్తి. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సైబర్ క్రైమ్ పోలీసులు బిత్తిరి సత్తి పై ఫిర్యాదు..
ఇకపోతే భగవద్గీత పై వీడియో పెట్టాడని కొంతమంది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బిత్తిరి సత్తి పైన ఫిర్యాదు చేశారు.ఏది ఏమైనా బిత్తిరి సత్తి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఇక క్షమాపణలు చెప్పి తాను తప్పు చేసి ఉంటే కేసు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు. మరి బిత్తిరి సత్తి చేసిన ఈ వీడియోకి ఎవరు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.