Bithiri Sathi..మొదట పలు న్యూస్ చానల్స్ లో కనిపించి అందరిని అలరించిన చేవెళ్ల రవి గురించి చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇతడిని బిత్తిరి సత్తి అంటేనే చాలామంది గుర్తుపడతారు. తన విచిత్రమైన మాటలతో, డైలాగులతో అందరిని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు బిత్తిరి సత్తి. ఇలాంటి బిత్తిరి సత్తి ఎలాంటి పని చేసినా కూడా చెల్లుతుంది అనుకున్నారేమో.. కానీ తాజాగా బిత్తిరి సత్తి మీద ఒక కేసు సైతం ఫైల్ అయినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి పూర్తిగా చూద్దాం.
భగవద్గీతను కించపరుస్తూ బిత్తిరి సత్తి వీడియో..
అసలు విషయంలోకి వెళ్తే, హిందువుల పవిత్ర గ్రంథం అయిన భగవద్గీత పైన వీడియో చేసి అడ్డంగా బుక్ అయిపోయారు బిత్తిరి సత్తి. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతున్నది. అయితే ఈ వీడియోలో భగవద్గీతను అనుసరిస్తూ తనదైన శైలిలో చాలా వ్యంగ్యంగా బిత్తిరి సత్తి చేసినటువంటి ఈ వీడియో పైన పలువురు నెటిజన్స్ సైతం ఫైర్ అయ్యారు. మరొకవైపు హిందూ సంఘాలు సైతం వెంటనే బిత్తిరి సత్తి పైన చర్యలు తీసుకోవాలి అంటూ చాలా ఫైర్ అవుతున్నారు. దీంతో చాలామంది సైతం బిత్తిరి సత్తి పైన ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు.
క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న హిందూ సంఘం నేతలు..
అంతేకాకుండా బిత్తిరి సత్తి ఆ వీడియోను సైతం డిలీట్ చేసి వెంటనే హిందువులకు సైతం క్షమాపణలు చెప్పాలి అంటూ హిందూ సంఘ నేతలు తెలియజేస్తున్నారు. హిందువులను కించపరిచేలా బిత్తిరి సత్తి చేసిన ఈ వీడియో.. తాను సమర్ధించుకున్నారని దీంతో బిత్తిరి సత్తి పైన సైబర్ క్రైమ్ పోలీసులకు వానర సేన అనే ఒక హిందూ సంఘం సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వెంటనే ఈ కేసు పైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. బిత్తిరి సత్తి చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని మరీ ఈ స్థాయికి వచ్చారు. అయితే ఈ స్థాయికి వచ్చిన తర్వాత తన పేరుని నిలబెట్టుకోవడంలో చాలా విఫలమవుతున్నారని అభిమానులు వాపోతున్నారు.
బిత్తిరి సత్తి పై కేసు ఫైల్..
ఇప్పటికే బిత్తిరి సత్తి పైన చాలా విమర్శలు , ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజానికి హిందువులు అత్యంత పవిత్రంగా కూడా భగవద్గీతను కొలుస్తూ ఉంటారు. అలాంటి భగవద్గీత పైన ఇలాంటి వీడియో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి అంటూ పలువురు హిందూ సంఘాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా భగవద్గీత కు బిల్లు గీత అని పేరు కూడా పెట్టాడు. దీంతో హిందూ సంఘాలు కూడా ఆగ్రహాన్ని తెలియజేస్తున్నాయి.అంతేకాదు వెంటనే సోషల్ మీడియాలో ఈ వీడియోలను తొలగించాలంటూ కూడా పలువురు హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. బిత్తిరి సత్తి వీటిని మీద తాను కూడా హిందువునే.. హిందువులను కించపరిచేలా తాను ఎప్పటికీ చేయనని కూడా తెలియజేశారు. బిత్తిరి సత్తి మాత్రం ఈ వీడియో కొన్ని వేల మందికి నచ్చింది మీలాంటి వాళ్లకి నచ్చకుంటే నేనేం చేయాలి అంటూ.. వానర సేన మెంబర్ కేశవరెడ్డి పైన ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయం ఎంతవరకు వెళుతుందో చూడాలి.