Bimbisara Prequel: డైరెక్టర్ ను మార్చేసిన కళ్యాణ్ రామ్… ఎందుకో తెలుసా?

Bimbisara Prequel : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్ తో ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ముఖ్యంగా బింబిసారా ప్రీక్వెల్ ఆయన అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. అయితే చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం ప్రకారమే ప్రీక్వెల్ కు డైరెక్టర్ ను మార్చేశారు కళ్యాణ్ రామ్. మరి దానికి కారణం ఏంటో తెలుసా?

డైరెక్టర్ ను మార్చేసిన హీరో

బ్లాక్‌బస్టర్ స్టేటస్‌ను తిరిగి పొందాలని నిర్ణయించుకున్న కళ్యాణ్ రామ్ ‘బింబిసార 2’పై దృష్టి పెట్టాడు. అయితే అతనికి, దర్శకుడు వశిష్టకు మధ్య సృజనాత్మక విభేదాలు తలెత్తాయని, అది వశిష్ట ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడానికి దారితీసిందని సమాచారం. ఆ తర్వాత వశిష్ట ‘విశ్వంభర’కు దర్శకత్వం వహించాడని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘బింబిసార’ ప్రీక్వెల్ ను తాజాగా ప్రకటించగా, అందులో డైరెక్టర్ ను మార్చేశారు మేకర్స్. కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ లో అది స్పష్టంగా కన్పిస్తోంది. రొమాంటిక్ ఫేమ్ దర్శకుడు అనిల్ పాదూరి బింబిసారా ప్రీక్వెల్ ను డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం NKR21 తో బిజీగా ఉన్నాడు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే బింబిసార ప్రీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించానున్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా, విజువల్‌గా అద్భుతమైన అనుభూతిని అందించేలా భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు.

- Advertisement -

ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ దే..

వశిష్ట దర్శకత్వం వహించిన ‘బింబిసార’ బ్లాక్‌బస్టర్ హిట్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ పెద్ద మలుపే తిరిగింది. ఈ చిత్రానికి ముందు కళ్యాణ్ రామ్ ఖాతాలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోవడానికి కష్టపడుతున్న కళ్యాణ్ రామ్ కు ‘బింబిసార’ మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రశంసలు దక్కడంతో పాటు అద్భుతమైన విజువల్స్‌తో సినీ ప్రేమికులు కూడా థ్రిల్ అయ్యారు. దర్శకుడు వశిష్ట క్రియేటివిటీ ‘బింబిసార’లో స్పష్టంగా కన్పించింది. గూస్‌బంప్స్ తెప్పించే సన్నివేశాలను, ఆకర్షణీయమైన కథాంశాన్ని రూపొందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. బింబిసారా సాధించిన విజయంతో సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి.

మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి

‘బింబిసార’ విజయం తరువాత కళ్యాణ్ రామ్ చేసిన సినిమా ‘అమిగోస్’. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ‘అమిగోస్’లో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రలను పోషించగా, కన్నడ నటి ఆషికా రంగనాథ్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దురదృష్టవశాత్తూ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అధైర్యపడకుండా కళ్యాణ్ రామ్ ‘డెవిల్’తో తిరిగి వచ్చాడు. ఈ సినిమాపై కూడా మంచి హైప్ ఉన్నప్పటికీ ‘డెవిల్’ కూడా నిరాశనే మిగిల్చింది. ‘బింబిసార’ తర్వాత విడుదలైన ఈ రెండు సినిమాలు ఫ్లాఫ్ కావడంతో కళ్యాణ్ రామ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు