Bhagyashri Borse: తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే ఎంట్రీ ఇచ్చిన ప్రతి వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా నిలబడతారు అని గ్యారెంటీ లేదు. ఇక ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ మీద అందరి కళ్ళు ఉన్నాయి. ఇంకా ఒక సినిమా కూడా రిలీజ్ కాకముందే ఆమెకు డిమాండ్ పెరిగిపోయింది. తెలుగులో దాదాపు నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటిలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఇకపోతే మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని అవకాశాలు వస్తాయి వేచి చూడాలి.
అయితే ఇప్పటివరకు మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి రిలీజ్ అయిన మూడు పాటల్లో కూడా భాగ్యశ్రీ చాలా అందంగా కనిపించింది. హరీష్ శంకర్ అంత బాగా చూపించాడు. ఏమాత్రం అశ్లీలత లేకుండా అందంగా చూపించొచ్చు అని నిరూపించాడు హరీష్. అయితే రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించి జరుగుతున్న ఈవెంట్స్ తో కూడా భాగ్యశ్రీ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారుతుంది. రీసెంట్ గా ఒక ఈవెంట్ లో కూడా డాన్స్ కూడా చేసింది. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ చాలా దగ్గరగా ఉండటం వలన కొన్ని రకాల ఇంటర్వ్యూస్ పాల్గొంటుంది భాగ్యశ్రీ.
రీసెంట్గా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మీరు ఎప్పుడైనా సెట్ కి లేటుగా వెళ్లారా అని అడిగితే, నేను ఎప్పుడూ సెట్ కి లేటుగా వెళ్లలేదు. నేను రవితేజ హీరోయిన్ అంటూ జవాబు ఇచ్చింది. కేవలం మీ ఒక్క మాటతో రవితేజ మీద ఉన్న గౌరవాన్ని అమాంతం పెంచింది అని చెప్పొచ్చు. దీన్నిబట్టి రవితేజ ఆన్ టైం సెట్ లో ఉంటారు. టైంను పర్ఫెక్ట్ గా పాటిస్తారు అని చాలాసార్లు విన్నాం. ఈ స్టేట్మెంట్ తో భాగ్యశ్రీ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది అని చెప్పొచ్చు.