BSS13 : టాలీవుడ్ లో నిర్మాతల ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) ఒకడు. పదేళ్ల కింద స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో మొదటి సినిమాతో యావరేజ్ సినిమాని అందుకున్నా, హీరోగా నిలదొక్కుకోగలడు అని పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ నమ్మకం ఇప్పటివరకు నిజమవలేదు. రొటీన్ యాక్టింగ్ చేస్తాడని విమర్శలు ఉన్న ఈ హీరో కష్టపడి ఏ సినిమా చేసినా అది ప్లాప్ అవుతుంది. మధ్యలో రాక్షసుడు అని రీమేక్ మూవీ తో వచ్చి ఓ మోస్తరు సక్సెస్ అందుకున్నాడు. కానీ దాంతో బెల్లంకొండకి ఒరిగిందేమి లేదు. ఇక లాస్ట్ ఇయర్ ఛత్రపతి హిందీ రీమేక్ తో డిజాస్టర్ అందుకున్న బెల్లంకొండ వారసుడికి ఓ నిఖార్సైన హిట్టు కావాలి. అందుకోసమే ఈ సారి పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఏకంగా నాలుగు ప్రాజెక్టులు సెట్స్ పై ఉంచాడు ఈ హీరో.
భాగ్యనగరంలో బెల్లంకొండ మూవీ షూటింగ్..
ఇదిలా ఉండగా బెల్లం కొండ శ్రీనివాస్ ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు లైన్లో పెట్టగా, అందులో మూడు సినిమాలు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. టైసన్ నాయుడు (Tyson nayudu) ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిషింగ్ దశకు చేరుకోగా, దీంతో పాటు ఓ హారర్ సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. ఈ సినిమాను కౌశిక్ పెగాళ్ళపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే కొత్త దర్శకుడు మహేష్ చందు దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా వీటి తర్వాత తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న మరో కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. ఈ హీరో నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నట్టు సమాచారం.
సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్..
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 13వ (BSS11) సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుండగా, ఈ సినిమాలో దర్శకుడు శంకర్ కూతురు “అదితి శంకర్” (Adthi shankar) హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం. ఇక తాజాగా ఈ సినిమా సెట్స్ లోకి అదితి శంకర్ కూడా అడుగుపెట్టిందని తెలుస్తుంది. ప్రస్తుతం హీరో హీరోయిన్ల మధ్య పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాను విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తుంది. తమిళ్ లో హిట్ అయిన గరుడన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది.