Bandla Ganesh: నటుడుగా కెరియర్ మొదలుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుని ప్రొడ్యూసర్ గా ఎదిగాడు బండ్ల గణేష్. ఆంజనేయులు సినిమాతో ప్రొడ్యూసర్ గా కెరియర్ మొదలుపెట్టిన గణేష్ కు గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి మంచి లాభాలను తీసుకొచ్చి పెట్టింది. గబ్బర్ సింగ్ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ తో తీన్మార్ అనే సినిమాను తీశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రమైన డిజాస్టర్ గురై నష్టాలను తీసుకొచ్చింది. ఇక గబ్బర్ సింగ్(Gabbar Singh) సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక్కడతో ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా నిలబడిపోయాడు బండ్ల గణేష్.
ఎన్టీఆర్(Ntr) అల్లు అర్జున్(Allu Arjun) వంటి హీరోలతో కూడా సినిమాలను నిర్మించి మంచి హిట్లు అందుకున్నాడు. ఇకపోతే నిర్మాతగా పీక్ లో ఉన్న టైంలో సినిమాలను ఆపేసాడు బండ్ల గణేష్. ఆ తర్వాత మళ్లీ నటుడుగా రీఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును మరోసారి సాధించుకున్నాడు. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూస్ లో కనిపిస్తూ చాలామందిని ఎంటర్టైన్ చేసేవాడు. అయితే బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు వాస్తవాలు అయినా కూడా అవి చెప్పే విధానం చాలా మందికి నవ్వు తప్పించేవిగా ఉండేవి.
ఒక సందర్భంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కూడా కొన్ని మాటలు అన్నారు బండ్ల గణేష్. ఆడియో బయటికి లీక్ అయింది. అయితే లీకైన ఆడియోలో ఉన్న వాయిస్ తనదే అంటూ ఒప్పుకున్నాడు బండ్ల గణేష్. ఇక గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో ఒక ప్రెస్ మీట్ ను పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తరువాత క్షమాపణలు చెబుతున్నాను. ఏ మూడు లో ఉన్నానో తెలియదు ఆరోజు అలా మాట్లాడేసాను. తర్వాత ఇద్దరం చాలా మాట్లాడుకున్నాం. నాకు గబ్బర్ సింగ్ ప్రాజెక్టు సెట్ చేసింది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు నా బ్రతుకుకు అర్థం చెప్పారు. అంటూ మాట్లాడారు బండ్ల గణేష్.