Balayya: బాలయ్య విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న నిర్మాతల మండలి.. మరి చిరును ఇలాగే వదిలేస్తారా?

Balayya: తెలుగు చిత్ర పరిశ్రమలో తాజాగా పలు ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నందమూరి నరసింహం బాలకృష్ణ విషయంలో నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. బాలయ్య సంగతి సరే మరి చిరును ఇలాగే వదిలేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఇంతకీ టాలీవుడ్లో ఏం జరుగుతోంది? బాలయ్య విషయంలో నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

బాలయ్యకు ప్రత్యేకంగా సన్మానం

ఆగస్టు 30 నాటికి నందమూరి బాలయ్య సినీ కెరీర్ స్టార్ట్ చేసి 50 ఏళ్లు పూర్తవుతుంది. ఈ ప్రత్యేక రోజును పురస్కరించుకొని ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి ఆయనను ఘనంగా సన్మానించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతల మండలి స్వయంగా బాలయ్య దగ్గరికి వెళ్లి విషయాన్ని వివరించగా, అందుకు ఆయన కూడా ఓకే చెప్పాడని సమాచారం. ఈ మేరకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి రిలీజ్ చేశారు. నందమూరి బాలయ్యను తాజాగా చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్ దామోదర్ ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, తెలుగు చలనచిత్రం వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి, కోశాధికారి టీ ప్రసన్న కుమార్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ 24 క్రాప్ట్స్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కలిసి బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సినీ ప్రముఖులు అందరూ కలిసి 2024 సెప్టెంబర్ 1న తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున ఆయనకు సన్మానం చేయబోతున్నారు. ఇక ఈ వేడుకలో భారతీయ సినిమాతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొంటారు.

Balakrishna Nandamuri: వారి అభ్యర్థనను అంగీకరించి.. సన్మానానికి ఓకే చెప్పిన బాలయ్య

- Advertisement -

1974 ఆగస్టు 30న రిలీజ్ అయిన తాతమ్మ కల సినిమాతో బాలయ్య కెరీర్ ను ప్రారంభించారు. సినీ కెరీర్లో 50 ఏళ్ల తర్వాత కూడా హ్యాట్రిక్స్ తో  ఆయన హీరోగా కొనసాగుతుండడం విశేషం. ఆయన గోల్డెన్ జూబ్లీ హీరో మాత్రమే కాదు రాజకీయ రంగంలో కూడా వరుసగా మూడుసార్లు ఏపీ శాసనసభకు ఎన్నికైన హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్  సాధించారు. అలాగే హైదరాబాద్లోని బసవతారకం ఇండో బ్రిటిష్ క్యాన్సర్ హాస్పిటల్స్ కు ఛైర్మన్ గా ఉన్న ఆయన ఈ ఆసుపత్రి అభివృద్ధికి చేసిన కృషి మరువలేనిది.

మరి చిరును ఇలాగే వదిలేస్తారా?

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో బాలయ్య, చిరుల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య ఇంట్లో జరిగే ఏ శుభకార్యానికి చిరును ఆహ్వానించరు. అలాగే చిరు కూడా. అయితే ఇప్పుడు బాలయ్యకు జరగబోతున్న సన్మానం ఈవెంట్ లో చిరు పాల్గొంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పవన్ డైరెక్ట్ గా టిడిపితో చేతులు కలిపి, కూటమి గెలుపులో కింగ్ మేకర్ గా మారిన విషయం తెలిసిందే. మరోవైపు దేశంలోని రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్న చిరును ఇప్పటి వరకు సినీ ప్రముఖులు సన్మానించలేదు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ బాలయ్య కంటే ఎక్కువే సాధించిన చిరును ఇలాగే వదిలేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు మెగా ఫ్యాన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు