Arjun Reddy: ఒక కథ రాసి సినిమాను చేసి రిలీజ్ చేయడం అనేది కొంతమంది దర్శకులకి నార్మల్ ప్రాసెస్ లా అనిపిస్తుంది. కానీ అతి తక్కువ మంది దర్శకులు మాత్రమే సినిమాని ఒక తపస్సులా చేస్తూ ఉంటారు. ప్రతిదీ డీటెయిల్ గా చెప్పాలి అని అనుకుంటారు. అలాంటి దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. 2017 ఆగస్టు 25న తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సంచలమైన సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు అర్జున్ రెడ్డి (Arjun Reddy). దాదాపు మూడు గంటలపాటు నిడివి ఉన్న ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో సంచలనంగా మారింది.
అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga). ఒక మామూలు కథను ఇంత బాగా చూపించగలగడానికి కారణం ఏంటి అంటే సందీప్ కి క్రాఫ్ట్ మీద ఉన్న క్లారిటీ. ఒక షార్ట్ కోసం ఒక సీన్ కోసం చాలా పర్టికులర్ గా ఉంటాడు సందీప్ రెడ్డి. తను ఏం కావాలనుకుంటాడు అది వచ్చినంత వరకు దానిని డిజైన్ చేస్తూనే ఉంటాడు. అందుకే అర్జున్ రెడ్డి సినిమాలోని ప్రతి ఫ్రేమ్ కూడా చాలామందిని విపరీతంగా అట్రాక్ట్ చేసింది. అయితే ఈ సినిమా మూడు గంటలు ఉంది దీనిని కనీసం 40 నిమిషాలు ట్రిమ్ చేస్తే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని సందీప్ రెడ్డి కి చాలామంది అప్పట్లో చెప్పారు. లేదు ఈ సినిమాని ఇలానే రిలీజ్ చేయాలి. ఈ సినిమాని 40 నిమిషాలు ట్రిమ్ చేస్తే అది ప్లాప్ అవుతుంది. అని సందీప్ రెడ్డివంగా చాలా కాన్ఫిడెంట్ గా ఈ సినిమాను రిలీజ్ చేశాడు.
ఇక ఈ సినిమా ఎంత హిట్ అయింది అని మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమా నుంచి డిలీటెడ్ సీన్స్ ని కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. వాటి కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంత మంచి సీన్ ని ఎలా తీసేసారు అన్న అంటూ చాలామంది కామెంట్స్ పెట్టారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ మూడు గంటల 40 నిమిషాల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కంప్లీట్ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత ఈ కంప్లీట్ సినిమాను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ వలన చూసిన సినిమా అయినా కూడా మరో మూడేళ్ల పాటు అసలు ఫుల్ వెర్షన్ ఏం తీశాడు చూద్దాం అని క్యూరియాసిటీతో ఆడియన్స్ ఎదురుచూడనన్నారు.