Pawan Kalyan : టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఆయన యాటీట్యూడ్ తో యూత్ కు బాగా దగ్గరయ్యారు. ట్రెండ్ ను ఫాలో అవ్వడు ట్రెండ్ ను సెట్ చేస్తాడు. ముక్కుసూటి మనిషి అందుకే పవన్ అంటే ఫ్యాన్స్ దేవుడు అంటున్నారు. మరెంతో మందికి శత్రువు. ఆయనను ప్రేమించేవారు ఎంత మంది ఉన్నారో.. ఆయనను విమర్శించేవారు అంతేముంది ఉన్నారు. ఇక ఇప్పుడు రాజకీయాల్లో అడుగడుగునా శ్రత్రువులే. ఆయన చేసే ప్రతి పనిని అడ్డుకోవడం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో రానిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని సాధించాడు. ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఏం గా భాద్యతలు నిర్వర్తిస్తున్నాడు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చెయ్యాలనే కోరికను తీర్చుకున్నాడు. జనం మెచ్చే నాయకుడు అయ్యాడు.
రాజకీయాల్లో కి వచ్చాక పవన్ కళ్యాణ్ చాలా మారిపోయాడని తన అభిమానులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఒకప్పుడు ఎవరు తనను ఒక్కమాట అన్నా కూడా అస్సలు ఊరుకోడు.. కానీ ఈ మధ్య ఎంతటివారికైనా తనదైన రీతిలో సమాధానమిస్తున్నాడు. అందరు ఎదురుగా ఉండి మాట్లాడింది వేరు .. ఎవరు లేనప్పుడు మాట్లాడింది వేరు. కానీ, పవన్ ఎప్పుడు ఒకేలా మాట్లాడతాడు అని ఆయన ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.. జాలి, దయ పవన్ కళ్యాణ్ కు ఎక్కువగానే ఉన్నాయి. ఆ రెండే ఆయన సక్సెస్ కు కారణాలు అని చెప్తున్నారు.
పవన్ కళ్యాణ్ పెద్దగా ఇంటర్వ్యూ లకు వెళ్లడు. గతంలో బాలయ్య (Balayya ) షోకు వెళ్లిన సంగతి తెలిసిందే.. ఆ షోలో ఎన్నో సంచలన విషయాలను బయట పెట్టారు. రాజకీయాల గురించి కూడా మాట్లాడాడు. మూడు పెళ్లిల గురించి క్లారిటీ ఇచ్చి అందరి నోర్లను మూయించాడు. అది నేను కావాలని చేసిన తప్పు కాదు.,. అది అలా జరిగిపోయింది అంటూ సమాధానము చెప్పాడు . తనను అనరాని మాటలు అన్నా కూడా పోనిలే.. అని వదిలేయడం, గుడ్డిగా దగ్గర ఉన్నవారిని నమ్మడం చాలా మంచిది కాదని, ముఖ్యంగా రాజకీయాల్లో సొంతవారిని కూడా అనుమానించాల ని అలాంటి గుణం పవన్ లో లేదని ఫ్యాన్స్ ఎప్పుడు చెప్తుంటారు. జాలి, దయ అనే బ్యాడ్ క్వాలిటీస్ పవన్ లో ఉండడం వలనే ఇంకా పూర్తి రాజకీయ నాయకుడిగా మారలేదని అంటున్నారు.. ఏది ఏమైనా పవన్ లైఫ్ మాత్రం గ్రేట్.. అందుకే యూత్ నాయకుడు అయ్యాడు.. ఇప్పుడు ఒక రాష్ట్రాని కి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.
పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది నుంచి నాలుగు సినిమాల ను అనౌన్స్ చేశాడు. ఆ సినిమాల షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ఇక త్వరలోనే ఒక్కో సినిమా విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఆయన కొత్త సినిమాలు అనౌన్స్ చేసే పరిస్థితిలో లేడు.. ఇకనుంచి కొత్త సినిమాలను ఎక్స్పెక్ట్ చేయలేము..