Anna Ben : టాలీవుడ్ లో ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అయిన కల్కి సినిమాలో చాలామంది ఆర్టిస్టులు తెలుగుతెరకు పరిచయమయ్యారు. అందులో “అన్నా బెన్” ఒకరు. ఈ పేరు చెప్తే సరిగా గుర్తు పట్టకపోవచ్చు గాని, కల్కి సినిమాలో కైరా అంటే యిట్టె చెప్పేస్తారు. కనిపించేది కాసేపే అయినా ఆ క్యారెక్టర్ ఫైర్ క్రాకర్ లా పేలింది. మలయాళ నటి అయిన ఈ బ్యూటీ సినిమాలో మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక హీరోయిన్ తో సమానంగా కైరా పాత్ర పోషించిన అన్నా బెన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమాలో ఆమె దీపికా పదుకొనే పోషించిన పాత్ర ‘సుమతి’ని బౌంటీ హంటర్స్ నుంచి రక్షించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా ఆమెను కాపాడి తన జీవితాన్ని కూడా త్యాగం చేస్తుంది. ఇక కల్కి2898AD సినిమా ద్వారా అన్నా బెన్ కు మంచి పాపులారిటీ దక్కింది.
సెట్స్ లో ఎంట్రీ ఇచ్చాకే తెలిసింది.. అక్కడేం లేదని..?
ఇకపోతే కల్కి బ్యూటీ అన్నా బెన్ తాజాగా ఇచ్చిన ఓ తమిళ ఇంటర్వ్యూ లో కల్కి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ… తనకు ‘కోట్టుక్కాలి’ సినిమా చేస్తున్నప్పుడే కల్కి ఆఫర్ వచ్చిందని చెప్తూ.. సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాక మాత్రం అక్కడేం లేదని చెప్పింది. ఒక సెట్ లేదు.. ఒక నేచర్ లేదు.. కేవలం గ్రీన్ స్క్రీన్ మాత్రమే ఉంది. ఇటు చూసినా గ్రీన్ సెట్ మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది. అక్కడుంది మొత్తం ఆర్టిఫీషియల్ టెక్నాలజీ. ఆ స్పేస్ లో మనం ఎలా నటించామన్నదే అసలు ఛాలెంజ్. కానీ ఫస్ట్ టైం అలాంటి వాతావరణంలో నటించాను. అదో డిఫరెంట్ ఏక్సపీరియెన్స్ అని అన్నా బెన్ చెప్పుకొచ్చింది.
వరుస ప్రాజెక్ట్స్ బిజీ అవుతున్న కల్కి బ్యూటీ..
ఇక మలయాళ నటి అయిన అన్నా బెన్ మాలీవుడ్ లో హెలెన్, కప్పెలా మరియు కుంబళంగి నైట్స్ వంటి చిత్రాలలో తన నటనతో ఆకట్టుకుంది. అయితే కల్కిలో కైరా పాత్ర ద్వారా ఓవర్ నైట్ స్టార్ డమ్ ని ఇండియా వైడ్ గా సంపాదించింది. ఇక తెలుగులో కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఆచితూచి అడుగులు వేస్తూ ఈ అమ్మాయి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక లేటెస్ట్ గా ఈ అమ్మాయి ది అడ్మన్ట్ గర్ల్ అనే తమిళ్ సినిమాలో నటించింది. ఇక కల్కి సీక్వెల్ మాత్రం 2026లో వచ్చే అవకాశం ఉంది.