Anil RaviPudi : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో పటాసులానే ఎంట్రీ ఇచ్చిన ఈ డైరెక్టర్ ఎంటర్టైన్మెంటే ప్రధానంగా సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. ఇక వరుసగా రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరూ, రీసెంట్ గా భగవంత్ కేసరి వంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లు అందుకుని స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి (Anil RaviPudi) వెంకటేష్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు మును వీరి కాంబోలో వచ్చిన ఎఫ్2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా వచ్చిన ఎఫ్3 కూడా ఓ మోస్తరు విజయం సాధించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబోలో సినిమా రాబోతుంది.
వెంకీ76 కి భారీ రెమ్యూనేషన్..
ఇక తాజాగా వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాకు “సంక్రాంతికి వస్తున్నాం (Venky76) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వెంకీ – అనిల్ రావిపూడి – దిల్ రాజు (Dilraju) కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు అనిల్ రావిపూడి భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఏకంగా 15 కోట్ల రూపాయల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అంతే కాదు రిలీజ్ తర్వాత లాభాల్లో ఏకంగా 10 కోట్ల వరకు షేర్ ప్రాఫిట్ రూపంలో తీసుకుంటున్నాడట. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకున్న డైరెక్టర్ లేరని టాక్. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు కాదు గాని, ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్ లో సినిమాలు తీసే దర్శకుల్లో అనిల్ ట్రెండ్ సెట్ చేసాడని చెప్పాలి.
సక్సెసే ఈ డిమాండ్ కి కారణం?
ఇక అనిల్ రావిపూడి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తొమ్మిదేళ్లు కావస్తుండగా, ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే అనిల్ ఈ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ కి కారణం అని చెప్పొచ్చు. మరి ఇంత సక్సెస్ రేట్ ఉన్నప్పుడు అంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం న్యాయమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రస్తుతం వెంకీ తో చేస్తున్న ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ (venkatesh) ఒక ఎక్స్ కాప్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.