Anasuya Bharadwaj: షాకింగ్‌…తమిళ ఇండస్ట్రీలో అనసూయ వేధింపులు..?

 

Anasuya Bharadwaj: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే ఫేమస్ అవుతారు. అలాంటి వారిలో అనసూయ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా పరిచయమైనటువంటి అనసూయ అతి తక్కువ సమయంలోనే యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని విపరీతంగా అవకాశాలను అందుకుంది. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా పలు ఈవెంట్లలో షోలలో సందడి చేస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉండేది.

ఇక కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా రాణించిన అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) సినిమాలపైన ఉన్న ఇష్టంతో సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళింది. ఇక సినిమాల్లో కీలకపాత్రలలో నటించి విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న అనసూయ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక అనసూయ తన యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి సినిమాలలో మాత్రమే నటిస్తోంది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో తన అభిమానులను నిత్యం అలరిస్తూనే ఉంటారు.

- Advertisement -

ఎప్పటికప్పుడు వరుసగా ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అనసూయ ఫోటోలు చూసి చాలా మంది అభిమానులు పలురకాలుగా కామెంట్లు, లైక్స్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా…. అనసూయకు (Anasuya Bharadwaj) సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీమణులు వేధింపులకు గురవుతారనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.

Anasuya: Anu's tattoo in secret place.. Youth getting hot..!

ఈ క్రమంలోనే అనసూయ కూడా ఈ వేధింపులను ఎదుర్కొన్నదని టాక్ వినిపిస్తోంది. అనసూయకు తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత అవకాశాలు ఇస్తానని చెప్పి తనను మోసం చేశాడట. సినిమాల్లో కీలక పాత్రల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి, ఆ తర్వాత తాను చెప్పినట్టు చేస్తేనే ఛాన్సులు ఇస్తానంటూ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అనసూయ సన్నిహితుల ద్వారా ఈ విషయం బయటకు వచ్చిందని అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సిన.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు