Anasuya Bharadwaj: టాలీవుడ్ ఇండస్ట్రీలో (Tolly wood) ఎంతమంది యాంకర్లు ఉన్నారు అందులో కొంతమంది మాత్రమే ఫుల్ ఫేమస్ అవుతారు అలాంటి వారిలో యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఒకరు. జబర్దస్త్ షో ద్వారా పరిచయమైనటువంటి అనసూయ అది తక్కువ సమయంలోనే మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా పలు షోలు ఈవెంట్లలో ఎంతో చురుగ్గా యాంకరింగ్ చేసేది. ఇక కొన్ని నీళ్లు పాటు యాంకర్ గా రాణించిన అనసూయ సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీ వైపుకు వెళ్ళింది.
అది తక్కువ సమయంలోనే సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని ఫుల్ ఫేమస్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. వరుస పెట్టి సినిమా అవకాశాలను అందుకుంది. ఇదిలా ఉండగా అనసూయ (Anasuya ) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు వరుస పెట్టి ఫోటో షూట్ చేస్తూ ఆ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటు నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే తాజాగా అనసూయ (Anasuya) తన భర్తతో కలిసి కాస్త రొమాంటిక్ గా కొన్ని ఫోటోలు దిగింది ఆ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది.
ఆ ఫోటోలో అనసూయ తన భర్తతో కలిసి షటిల్ ఆడుతూ కొన్ని ఫోటోలు, వీడియోలను పంచుకుంది. అందులో అనసూయ తన భర్తను రొమాంటిక్ గా టచ్ చేస్తూ కనిపించింది. అంతేకాకుండా ఈ ఫోటో అనసూయ టీ షర్ట్, షార్ట్ వేసుకుంది. ఈ ఫోటోలు చూసిన చాలామంది అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంత పొట్టి బట్టలు వేసుకునే వర్షంలో భర్తతో అలా ఫోటోలు వీడియోలు చేయడం అవసరమా అని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. పంచుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.