Pottel : టాలీవుడ్ లో ఈ మధ్య వెరైటీ పేరుతో జనాల్లోకి వచ్చి సినిమాని ప్రమోట్ చేయడం కామన్ అయిపొయింది. సినిమాలా కాకుండా నిజంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందేమో అని చిత్ర యూనిట్ తమ సినిమాలు ప్రమోట్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో ఓ మూడేళ్ళ కింద విశ్వక్ సేన్, అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాకు రోడ్డుపై చేసిన విన్నూతమైన సినిమా ప్రమోషన్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఆ సినిమాకి టివిలో డిబేట్లు కూడా పెట్టారు. అయితే సినిమాకి అది ప్లస్ అయి బాగా ప్రమోట్ అయింది. అయితే దాని తర్వాత అలాంటి ప్రమోషన్లు బాగా చేస్తున్నారు. మొన్నా మధ్య రెండు నెలల కింద నివేదా పేతురాజ్ కూడా తన ఓటిటి సిరీస్ కోసం ఇలాగే ప్రమోషన్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక రీసెంట్ గా మా బేబీ తప్పిపోయింది అంటూ, సీనియర్ హీరో నరేష్ ఓ వీడియో చేసాడు. అది వెబ్ సిరీస్ ప్రమోషన్ అని అప్పుడే తెలిసిపొయింది. ఇక ఇప్పుడు అలాంటి విన్నూతమైన ప్రమోషన్ ఓ సినిమాకు చేస్తున్నారు. మా పొట్టేల్ తప్పిపోయిందీ.. ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ రోడ్డెక్కింది అనన్య నాగళ్ల. హైదరాబాద్ లో ఐమాక్స్ థియేటర్ వద్ద తమ వారితో కలిసి ప్లకార్డులు ప్రదర్శించింది. తమ పొట్టేలును పట్టిస్తే తగిన పారితోషికం ఇస్తామంటూ ఆ ప్లకార్డులలో రాసి ఉంది. 3 నెలలుగా తమ పొట్టేల్ కనిపించకుండా పోయిందని, తమని ఊర్లోకి కూడా రానివ్వడంలేదు అంటూ అనన్య ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇదంతా మూవీ ప్రమోషన్ అని తెలిసిపోయింది. దీనిపై వివరాలు ఇలా ఉన్నాయి.
అందరికీ అలవాటైపోయింది..
తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ళ(Ananya Nagalla) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా “పొట్టెల్”. గ్రామీణ నేపథ్యంలో ఈ ‘పొట్టేల్’ సినిమా తెరకెక్కగా సాహిత్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాకు తాజాగా పొట్టెల్ (Pottel) పోయిందంటూ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రమోషన్లను ఆడియన్స్ అంతగా పట్టించుకోవట్లేదు. ఒకసారి క్లిక్ అయిందని అన్ని సినిమాలకు వర్కౌట్ అవుతుందని అనుకోవద్దు. కానీ ఎవరి ప్రయత్నం వాళ్ళది. ఇంకాస్త కొత్త రకంగా ప్రమోట్ చేస్తే మంచిదని నెటిజన్లు అంటున్నారు. ఇక శేఖర్‌చంద్ర మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు నిశాంత్ రెడ్డి కుడితి, సురేశ్ కుమార్ సడిగే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, రియాజ్, నోయల్ సీన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.