Amala Paul: అమలాపాల్ ప్రవర్తన అంత దారుణమా.. హేమా కామెంట్స్..!

Amala Paul.. కేరళ కుట్టి అమలాపాల్ తమిళ్ సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. తెలుగులో అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో అనే సినిమా ద్వారా అడుగుపెట్టిన ఈమె.. తన అందచెందాలతో, నటనతో తెలుగు ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఇక తర్వాత తెలుగులో పలు చిత్రాలలో నటించిన ఈమె.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి పూర్తిస్థాయిలో క్రైమ్ సస్పెన్స్ స్టోరీలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా అమలాపాల్ ప్రవర్తనకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.

Amala Paul: Is Amala Paul's behavior so bad.. Hema's comments..!
Amala Paul: Is Amala Paul’s behavior so bad.. Hema’s comments..!

హెయిర్ స్టైలిస్ట్ కి అవమానం..

సాధారణంగా వెండితెరపై నటీనటులు అందంగా కనిపించాలి అంటే మేకప్ ఆర్టిస్ట్ లు, హెయిర్ స్టైలిస్టులు అత్యంత ముఖ్యపాత్ర పోషిస్తారు.. పాత్రకు తగినట్టుగా హీరో హీరోయిన్లను చాలా అందంగా ముస్తాబు చేస్తూ ఉంటారు.. కానీ సినిమా షూటింగ్ సెట్ లో వారికి తగిన గౌరవం , గుర్తింపు ఉండదు. కొన్నిసార్లు పలువురు తారాలతో తమకు చేదు అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయని చెబుతున్నారు.. ఈ క్రమంలోనే అలాంటి ఒక ఘటనను గుర్తు చేసుకుంటూ హీరోయిన్ అమలాపాల్ తమతో ప్రవర్తించిన తీరును బయటపెట్టింది ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హేమ.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హెయిర్ స్టైలిస్ట్ హేమ అమలాపాల్ ప్రవర్తన పై షాకింగ్ కామెంట్లు చేయడం.

అమలాపాల్ ప్రవర్తన చాలా దారుణం..

అమలాపాల్ గురించి హెయిర్ స్టైలిస్ట్ హేమ మాట్లాడుతూ.. నాకు అమలాపాల్ గురించి ఏమీ తెలియదు.. కేవలం ఒక స్నేహితుడి ద్వారా మాత్రమే ఆమె పరిచయం.. ఏప్రిల్ , మే నెలలో షూటింగ్ కోసం.. చెన్నైకి వెళ్ళినప్పుడు.. అక్కడ చాలా ఎండ.. వేడిగా కూడా ఉంది.. నీడ కోసం చూస్తే ఆ లొకేషన్లో ఒక చెట్టు కూడా లేదు.. దీంతో అక్కడే ఉన్న వ్యానిటీ వాన్ లోపలికి వెళ్ళాము.. అందులో రెండు భాగాలు ఉన్నాయి.. ఒకటి కళాకారులు కూర్చోవడానికి.. మరొకటి టెక్నికల్ టీం ఉండడానికి.. కానీ మేము లోపలి కూర్చోగానే అమలాపాల్ మేనేజర్ వచ్చి మమ్మల్ని బయటికి వెళ్లి పోవాలని.. అందులో కూర్చోవడానికి వీలు లేదని చెప్పారు.. దీంతో నేను , మేకప్ పార్టిస్ట్ ఒకరి ముఖం ఒకరు చూసుకొని..ఇంత వేడిలో బయటికి ఎక్కడికి వెళ్తాము అని అనుకున్నాం.. కానీ ఆ వ్యాన్ నుంచీ దిగాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది హేమ..

- Advertisement -

టబు చాలా మంచివారు.. అమలాపాల్ ప్రవర్తన నచ్చలేదు..

దక్షిణాదిలో ఎలా పనిచేస్తారో నాకు తెలియదు.. కానీ వ్యానిటీ వాన్ లోపలికి హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్ లు రాకూడదని నియమాలు ఉన్నాయేమో అక్కడ.. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిష్లకు విలువ ఇవ్వరు. అందుకే వారికి మనం ఎలా మనల్ని పరిచయం చేసుకోవాలి అనే విషయం తెలియదు.. కానీ నార్త్ లో అలా కాదు.. నేను హీరోయిన్ టబు దగ్గర కూడా హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేశాను.. ఆమె చాలా బాగా చూసుకుంటారు.. మా అందరి కోసం మొత్తం వ్యాన్ బుక్ చేస్తారు.. కానీ సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది అంటూ తెలిపింది హేమ.. అయితే హేమ చేసిన కామెంట్లకు అమలాపాల్ ఆటిట్యూడ్ పై విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు