Allu Vs Mega Family: మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఏం జరుగుతుంది.? అల్లు అర్జున్ అన్ఫాలో చేసిన మెగా హీరో.

Allu Vs Mega Family: మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలి కి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఫంక్షన్ అయినా ఈ రెండు కుటుంబాలు కలిసి చేసుకుంటాయి. కానీ ఇదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఫ్యామిలీస్ రెండు వేరువేరు అయిపోయాయి అంటూ ఎన్నో కథనాలు వినిపిస్తూ వచ్చాయి. ముఖ్యంగా ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య విభేదాలు రావడానికి అల్లు అర్జున్ కారణమంటూ చాలామంది చెబుతూ ఉంటారు. అల్లు అర్జున్ కెరియర్లో ముందుకు రావడానికి స్టార్టింగ్ లో మెగాస్టార్ చిరంజీవి పేరు వాడుకుని తనకు పేరు వచ్చిన తర్వాత మెగాస్టార్ ను వదిలేసాడు అంటూ చాలామంది విమర్శలు చేస్తారు.

Allu Ve Mega Family
Allu Ve Mega Family

ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ కు వివాదం ఎక్కడ మొదలైందో మనకు తెలియంది కాదు. పవర్ స్టార్ అని ఒక ఫంక్షన్ లో అరిచినప్పుడు నేను చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ తో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత ఒక మనసు అనే సినిమా ఆడియో రిలీజ్ లో ఈ టాపిక్ గురించి దాదాపు పది నిమిషాల పాటు అల్లు అర్జున్ మాట్లాడటంతో ఇది పీక్ కి వెళ్ళిపోయింది. ఇకపోతే ఆ సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ అనే అరిస్తే నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్లు అరిచేది మా మామయ్య పేరే కదా అంటూ చెప్పుకొచ్చాడు. అలానే ఒక మనసు ఆడియో లాంచ్ లో అల్లు అర్జున్ మాట్లాడుతున్నంత సేపు ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా నార్మల్గా కూర్చున్నాడు సాయిధరమ్ తేజ్.

Mega Family

- Advertisement -

ఇకపోతే సాయి ధరమ్ తేజ్ అంటే మెగా హీరోలకు ఎంత అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరూ చాలా ఎక్కువగా సాయి తేజ్ ను ప్రేమిస్తారు. ఇకపోతే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సాయిధరమ్ తేజ్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇకపోతే ఒక వైసీపీ పొలిటిషన్ కోసం అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి మళ్లీ అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య వివాదం ముదిరింది. ఇకపోతే ట్విట్టర్ ఇంస్టాగ్రామ్స్ లో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఇక్కడితో అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య వివాదం ఉన్నట్లు కొంతమేరకు అర్థమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు