Allu Arjun Vs Mega Family: తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో అంటే తెలుగులో అందరికీ వినిపించే పేరు మెగాస్టార్ చిరంజీవి. ముందుగా కొన్ని సినిమాల్లో విలన్ వేషాలు వేసి ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని హీరోగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఖైదీ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి చిరంజీవిని స్టార్ హీరో చేసింది. తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సక్సెస్ఫుల్ సినిమాలను చేసారు మెగాస్టార్ చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని చాలామంది హీరోలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వాటిలో చాలామంది హీరోలు ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ తేజ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సాధించుకున్నాడు. ఇక అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. మిగతా యంగ్ హీరోస్ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేసుకుంటూ తమకంటూ సొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.
ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి మధ్య చాలా విభేదాలు వస్తున్నాయి. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే మెగా అభిమానులు మాత్రం అల్లు అర్జున్ పై తీవ్రమైన కోపంతో ఉన్నారు. గతంలో అల్లు అర్జున్ చిరంజీవిని పొగిడిన వీడియోస్ ను బయటకు తీస్తూ ఇప్పుడు అల్లు అర్జున్ మాటలతో కంపేర్ చేస్తూ ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఇకపోతే చాలా చిన్నతనం నుండే అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఎలా ట్రీట్ చేశారు అనే వీడియోలు కూడా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
ఇకపోతే గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు వేయించుకుంటూ తనకంటూ ఒక సొంత ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్న మాట వాస్తవమే. కానీ ఈ ప్రాసెస్ లో సక్సెస్ఫుల్ సినిమాలు చేసి అభిమానులు వచ్చిన తర్వాత, మెగా అభిమానులు అల్లు ఆర్మీ అంటూ ఫ్యాన్స్ ను సపరేట్ చేసేసాడు బన్నీ. అయితే చిరంజీవీ గారు మొదట్లో ఎంకరేజ్ చేయడం వలన ఇక్కడ వరకు వచ్చాడు అంటూ చాలామంది మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలానే కన్న కొడుకులా చూసుకున్న పెద్దాయనకి వెన్నుపోటు పొడిచాడు అంటూ ట్రోల్ కూడా చేస్తున్నారు.