ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆలియా భట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. ఇటీవల తను ప్రేమించిన స్టార్ హీరో రణబీర్ కపూర్ ని వివాహమాడిన సంగతి తెలిసిందే.
అయితే పెళ్లి జరిగి ఆరు నెలలు గడవకముందే ఈ జంట తమ మొదటి బిడ్డకు జన్మనివ్వడం విశేషం. 2022 నవంబర్ 28న రహ కపూర్ ను తమ జీవితంలోకి స్వాగతించారు రణబీర్, ఆలియా. కేవలం హిందీ లోనే కాకుండా తెలుగు సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రతో మెప్పించిన ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.
Read More: Tees Maar Khan Teaser : పవర్ ఫుల్ పోలీస్ గా ఆది
అయితే ఈ జంటపై తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆలియా త్వరలోనే రెండో బిడ్డకు వెల్కమ్ చెప్పనుందని బి టౌన్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈమె ఇటీవల ఓ దుస్తుల కంపెనీ కోసం ప్రచారం చేసినట్లు తెలుస్తుంది. అందులో కొత్త వెటర్నరీ కలెక్షన్స్ ని లాంచ్ చేసినట్లు సమాచారం.
ఇది చూసిన కొందరు నటిజన్లు ఆలియా మళ్లీ గర్భం ధరించిందనే విషయాన్ని నిర్ధారించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ జంట అధికారికంగా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఇదిలా ఉంటే.. మరోవైపు ఆలియా రాఖి ఔర్ రాణి కి ప్రేమ్ కహాని లో మరోసారి రణవీర్ సింగ్ సరసన నటిస్తుంది. ఇక రణబీర్ రాబోయే ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న “యానిమల్” లో నటిస్తున్నారు.
Read More: Vijay Deverakonda : రౌడీ హీరో పై నెటిజన్లు కౌంటర్లు
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...