KhelKhelMein Movie : బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ పరిస్థితి ఇప్పుడు చిన్న హీరోల కన్నా అద్వానంగా తయారయింది. ఒకప్పుడు వరుస హిట్లతో ఖాన్ తర్యానికి కూడా సవాల్ విసిరిన ఈ హీరో, ఇప్పుడు ఓ మోస్తరు హిట్ కూడా కొట్టలేకపోతున్నాడు. ముఖ్యంగా లాక్ డౌన్ తర్వాత ఒక్కటంటే ఒక్క నిఖార్సయిన హిట్ కొట్టలేదు. గడిచిన నాలుగేళ్లలో ఏకంగా 8 ప్లాప్ లు అందుకున్నాడంటే మామూలు విషయం కాదు. మధ్యలో OMG2 ఓ మోస్తరు హిట్ అయింది. ఇక ఈ ఇయర్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్న బడే మియా చోటే మియా డిజాస్టర్ అయింది. రీసెంట్ గా సూర్య ఆకాశమే నీ హద్దురాని సర్ఫిరా గా రీమేక్ చేసినా ప్లాప్ అందుకోగా తప్పలేదు. ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా, ఒరిజినల్ ని చాలామంది చూసేయడంతో థియేటర్లకు జనాలు రాలేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఒక రీమేక్ సినిమాని నమ్ముకున్నాడు బాలీవుడ్ కిలాడీ.
26 భాషల్లో రీమేక్ అయిన సినిమాతో వస్తున్నాడు…
ఇక అక్షయ్ కుమార్ ఎట్టి పరిస్థితులలో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మళ్ళీ ఓ రీమేక్ సినిమానే నమ్ముకున్నాడు. ఆ సినిమా పేరు “ఖేల్ ఖేల్ మే” (KhelKhelMein Movie). ఈ సినిమా 2016 లో ఇటాలియన్ భాషలో తెరకెక్కిన “పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్” అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా అత్యధిక భాషల్లో రీమేక్ అయిన మూవీగా గిన్నిస్ బుక్ రికార్డ్ లోకి ఎక్కింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు ఏకంగా 26 భాషల్లో రీమేక్ అయిందట. ఇప్పుడు 27వ సారి హిందీలో అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’ పేరుతో రీమేక్ చేసాడు. మరి ఇన్ని చోట్ల రీమేక్ అయిందంటే ఈ సినిమా కథ ఎంత పాపులరో అర్ధం చేసుకోవచ్చు.
దీంతోనైనా హిట్టు కొడతాడా?
ఇక ఇన్ని భాషల్లో రీమేక్ అయిన సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని వస్తున్నాడు అక్షయ్. ఇక ఈ సినిమా ఆగస్టు 15న ఇండియాలో గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాతో కం బ్యాక్ హిట్టు కొడతాడని నమ్మకంగా ఉన్నాడు అక్షయ్ కుమార్. పైగా ఖేల్ ఖేల్ మే సినిమాకి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగిందట. సాటిలైట్, డిజిటల్ రైట్స్ కాకుండా థియేట్రికల్ పరంగా దాదాపు 120 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుందట. మరి ఈ సినిమాతో కం బ్యాక్ హిట్ ఇచ్చి సక్సెస్ ట్రాక్ లో పడతాడా లేదా చూడాలి.