Akshara Haasan.. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఇట్టే ప్రేమలో పడిపోయి, అట్టే మనస్పర్ధలు వచ్చి విడిపోతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఆ తర్వాత తాము ఎందుకు విడిపోతున్నాము అనే విషయంపై కూడా స్పష్టత ఇస్తున్నారు. ఇదిలా ఉండగా విశ్వ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ (Kamal Haasan) చిన్న కుమార్తె అక్షర హాసన్ (Akshara Haasan) , తనూజ్ వీర్వాణి (Tanuj Virwani)ని ప్రేమించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. ఈ బ్రేకప్ కి గల కారణాలను అక్షరా హాసన్ బాయ్ ఫ్రెండ్ తనూజ్ వీర్వాణి స్పష్టం చేశారు.
అక్షర హాసన్ తో బ్రేకప్ పై తనూజ్ క్లారిటీ..
అసలు విషయంలోకి వెళ్తే.. అక్షర హాసన్ తో నాలుగేళ్లుగా డేటింగ్ లో ఉన్న తనూజ్ వీర్వాణి.. ఇటీవల ఆమెకు బ్రేకప్ చెప్పాడు. ఈయన బాలీవుడ్ నటుడుగా పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వీరు బ్రేకప్ చెప్పుకోవడానికి గల కారణాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు తనూజ్. గతంలో అక్షర హాసన్ ప్రైవేట్ ఫోటోలు ఆన్లైన్లో లీక్ అవడంపై ఆయన స్పందించారు. బ్రేకప్ అయిన తర్వాత కూడా నేను అక్షరతో మాట్లాడుతూనే ఉన్నాను. ప్రేమలో ఉన్న వ్యక్తులు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలి కదా.. ఒకరికొకరు అండగా నిలబడాలి కూడా.. మా ఇద్దరికీ ఆ విషయంలోనే విభేదాలు వచ్చాయి. అందుకే విడిపోయాం.. అంతే తప్ప ఆమె ప్రైవేట్ ఫోటోలు లీకైన కారణంగా నేను ఆమెకు బ్రేకప్ చెప్పలేదు.
నా తప్పు లేదని ఆమె ఒక్క ప్రకటన కూడా చేయలేదు..
మా ఇద్దరి మధ్య వివాదం బాగా పెరిగిపోయింది. అందుకే మా ఇద్దరికీ దూరం పెరిగింది. అవి నా కారణంగానే లీక్ అయ్యాయని ఆమె భావించింది. అందుకే అవసరం ఉన్నప్పుడు ఆమె నాకు అండగా నిలబడలేకపోయింది. ఈ విషయంలో నేను ఆమెను నిందించాలని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి కదా ఆ కారణాలతోనే నేను ఆమెకు బ్రేకప్ చెప్పేసాను అంటూ తెలిపారు తనూజ్ వీర్వాణి.
ఫోటోలు లీక్ అవడానికి కారణం నేను కాదు..
ఇకపోతే ఈ విషయంపై గతంలో కూడా తనూజ్ వీర్వాణి స్పందించారు. ఈయన మాట్లాడుతూ m.. నేను అక్షర ప్రైవేట్ ఫోటోలు లీక్ చేశానంటూ కొంతమంది పత్రికలలో తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. ఈ విషయాన్ని ఆమె ఖండించలేకపోయింది. వ్యక్తిగతంగా నన్ను నమ్మినప్పటికీ కూడా బయట ప్రపంచానికి మాత్రం నా తప్పు లేదు అని కనీసం ఒక్క ప్రకటన కూడా ఆమె చేయలేదు. ఆ విషయంలో నేను ఎంతో బాధపడ్డాను. నా భాగస్వామిని చేసుకోవాలనుకున్నాను కానీ ఆమె మాత్రం ఈ విషయంపై స్పందించకపోవడం నన్ను మరింత బాధకు గురిచేసింది. ఇక ఇలాంటి వాళ్లతో జీవించడం కష్టమని, నన్ను నేను కించపరుచుకునే విధంగా ప్రవర్తించలేనని అందుకే ఆమెతో విడిపోయాను అంటూ క్లారిటీ ఇచ్చారు. అక్షర ఫోటోలు లీక్ అవడంపై నిజం ఎప్పటికైనా బయటకి వస్తుందని నేను నమ్ముతున్నాను అంటూ కూడా తెలిపారు. మొత్తానికి అయితే తన మనసులో బాధను బయట పెడుతూ అసలు విషయంపై క్లారిటీ ఇచ్చారు తనూజ్.