Akhil Akkineni : చాలా రోజులకు అయ్యగారి దర్శనం… జూలపాల జుట్టుతో.. కొత్త సినిమా కోసమా?

Akhil Akkineni : గత కొంతకాలంగా అక్కినేని అభిమానులు సరైన సినిమా లేక డీలా పడ్డ సంగతి తెలిసిందే. లాస్ట్ ఇయర్ భారీ డిజాస్టర్లతో అక్కినేని హీరోలందరూ ప్లాప్ లు అందుకున్నారు. కానీ ఇప్పుడు మెల్లిగా అక్కినేని హీరోలు గాడిలో పడుతున్నారన్న నమ్మకం అక్కినేని అభిమానుల్లో మొదలైంది. ఈ ఇయర్ అక్కినేని నాగార్జున సంక్రాంతికి నా సామిరంగ తో వచ్చి శుభారంభాన్ని ఇచ్చారు. ఇక నాగ చైతన్య కూడా తండేల్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయనున్నారు. అలాగే ఈ ఇయర్ ఎండింగ్ లో నాగార్జున ధనుష్ తో కలిసి కుబేర తో పలకరించనున్నాడు. ఎటొచ్చి అక్కినేని అఖిల్ పైనే అందరి ద్రుష్టి పడింది. ఇక అక్కినేని అఖిల్ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో కనిపించడం లేదన్న సంగతి తెలిసిందే. ఆన్లైన్ లో ఆఫ్లైన్ సైలెంట్ అయిపోయాడు. ఏజెంట్ ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది మరి.

Akhil Akkineni Latest Looks in Stunning Makeover

స్క్రీన్ పై కనిపించి ఏడాది పైనే?

ఇక అక్కినేని అఖిల్ బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమయ్యింది. గతేడాది ఏప్రిల్ ‏లో ఏజెంట్ సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ చివరకు మళ్లీ నిరాశనే మిగిల్చింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ కోసం అఖిల్ పూర్తిగా తన లుక్ మార్చేసి.. సిక్స్ ప్యాక్ బాడీతో కఠినమైన స్టంట్స్ చేసినా ఆశించిన ఫలితం మాత్రం రాలేకపోయింది. దాదాపు రెండేళ్లపాటు పడిన కష్టం అంతా వృథా అయ్యింది. ఏజెంట్ డిజాస్టర్ కావడంతో అఖిల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా ఈ హీరో తదుపరి ప్రాజెక్ట్ ను ఇంకా ప్రకటించలేదు. అయితే తన 6 వ చిత్రం ను సాహో మరియు రాధే శ్యామ్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనిల్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.

- Advertisement -

స్టన్నింగ్ మేకోవర్ తో అఖిల్ ఎంట్రీ…

అయితే అక్కినేని అఖిల్ (Akhil Akkineni) చాలా రోజుల తర్వాత బయట కనిపించాడు. నిన్న (జూన్ 12) సాయంత్రం హైదరాబాద్ విమానాశ్రయం వద్ద గుబురు గడ్డం, పొడవాటి జుట్టు తో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ లేటెస్ట్ స్టన్నింగ్ మేకోవర్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది ఖచ్చితంగా తన నెక్స్ట్ మూవీ కోసం అని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి అఖిల్ ఎలాంటి అప్డేట్ ను అందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక అఖిల్ తన తదుపరి చిత్రం సొంత బ్యానర్ లో కూడా చేస్తాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. అక్కినేని నాగార్జున ఓ కొత్త డైరెక్టర్ తో అఖిల్ తో లవ్ స్టోరీ చేయిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇదెంత వరకు నిజమో తెలీదు. ఏది ఏమైనా అక్కినేని అఖిల్ కి ఇప్పుడు స్ట్రాంగ్ కం బ్యాక్ హిట్ కావాలి. అందుకోసం సేఫ్ జోన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాగా మరో డీసెంట్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు