Akash Jagannadh: స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పూరి జగన్నాథ్ తీసే సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. పూరి జగన్నాథ్ హీరో క్యారెక్టర్ ను చాలా బాగా రాస్తాడు దాని కోసమైనా సినిమాకి వెళ్లాలి అంటూ డిసైడ్ అయిన ఆడియన్స్ చాలా మంది ఉండేవాళ్ళు. అలానే రవితేజ,పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ , ప్రభాస్ వంటి హీరోల అందరితో కూడా సినిమాలు చేసి మంచి హిట్స్ అందుకున్నాడు. పూరి పీక్‌లో ఉన్న టైంలో తన కొడుకు ఆకాష్ పూరి పూరి సినిమాల్లో కనిపిస్తూ ఉండేవాడు.
చిన్న చిన్న సినిమాల్లో పాత్రలను పోషించిన ఆకాష్(Akash). ప్రకాష్ రాజ్(Prakash Raj) దర్శకత్వం వహించిన ధోని సినిమాతో మంచి గుర్తింపును పొందుకున్నాడు. ఆ తర్వాత ఆంధ్ర పోరి(Andhra Pori) అనే సినిమాను కూడా చేశాడు. అయితే ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెహబూబా అనే సినిమాకు పనిచేశాడు ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఆ తర్వాత రొమాంటిక్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు ఆకాష్ ఆ సినిమా కూడా డిజాస్టర్.
జార్జి రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్న జీవన్ రెడ్డి దర్శకత్వంలో చోర్ బజార్ అనే సినిమాలో కనిపించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఆకాష్ మంచి టాలెంట్ ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ స్క్రిప్ట్ సెలక్షన్స్ లో ఆకాష్ చాలా పూర్ అని చెప్పాలి. సరైన కథను ఎన్నుకోవడంలో తడబడుతున్నాడు. ప్రస్తుతం గత రెండేళ్ల నుంచి ఆకాష్ ఒక సినిమా కూడా చేయలేదు. దీనిపైన ఆకాష్ స్పందించాడు. నేను ఖాళీగా ఉండడం లేదు చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. నాకు ఒక్క పెద్ద ప్రొడక్షన్ హౌస్ తో ఒక మంచి డైరెక్టర్ తో మంచి ప్రాజెక్ట్ సెట్ అయింది. ఆగస్టు 19న ఆ సినిమా అనౌన్స్ అవుతుంది అంటూ అప్డేట్ ఇచ్చాడు. ఆకాష్ చేస్తున్న సినిమాకు తల్వార్ అనే టైటిల్ ఖరారు చేసారు. అధికారికంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రివీల్ చేసారు.