Aditi Rao hydari – Siddharth.. ప్రముఖ టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ (Siddarth) , యంగ్ బ్యూటీ అదితి రావు హైదరి (Aditi Rao Hydari) ఎట్టకేలకు మూడు ముళ్ళతో కొత్త బంధంలోకి అడుగుపెట్టారు. తెలంగాణలోని వనపర్తి లో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీరంగాపూర్ లోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అయితే రహస్యంగా గుడిలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సింపుల్ గా గుడిలో పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్ – అదితి..
దక్షిణాది సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను అదితి రావు హైదరి తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది.. నువ్వే నా ప్రపంచం అంటూ అందమైన క్యాప్షన్ తో తమ పెళ్లి ఫోటోలను షేర్ చేసింది అదితి. అదితి రావు హైదరి గోల్డెన్ జెరీ వర్క్ తో డిజైన్ చేసిన అద్భుతమైన టిష్యూ ఆర్గాంజా లెహంగా ధరించి, దానికి సరిపోయే చేతితో చేసిన ఎంబ్రాయిడరీ బార్డర్ కలిగిన గోల్డెన్ బ్లౌజ్ ను ధరించింది .ఇక వరుడు సిద్దార్థ్ సాంప్రదాయ వేస్టి బాటమ్ తో స్టైల్ చేసిన మైక్రో ఎంబ్రాయిడరీ తో కూడిన కుర్తా ధరించారు. ఇక పెళ్లి బట్టల్లో వీరిద్దరూ చాలా అందంగా కనిపించారని చెప్పవచ్చు.
సిద్ధార్థ్ – అదితి ప్రేమ వ్యవహారం..?
సిద్ధార్థ్ అదితి రావు హైదరీల విషయానికి వస్తే.. చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. అంతేకాదు ఇద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారు. కానీ ఈ విషయంపై ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ ఏడాది మొదట్లో నిశ్చితార్థం చేసుకున్నామని మీడియాతో ప్రకటించింది ఈ జంట. ఇక వివాహం ఎప్పుడు చేసుకుంటారని అభిమానులు సైతం ఆత్రుతగా ఎదురు చూడగా.. ఈరోజు ఎట్టకేలకు వివాహం చేసుకుంది ఈ జంట. ఇక కుటుంబ సభ్యుల మధ్య , సన్నిహితుల మధ్య మూడు ముళ్ళు , ఏడడుగులతో కొత్త బంధంలోకి అడుగు పెట్టారు.
ఇద్దరికీ రెండవ వివాహం..
ఇకపోతే ఇద్దరికీ కూడా ఇది రెండవ వివాహం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదివరకే సిద్దార్థ్ 2003లో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘన ను ప్రేమించి పెళ్లి చేసుకోగా.. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2007లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అతిధిరావు హైదరితో ప్రేమలో పడ్డ ఈయన ఈ ఏడాది మార్చ్ 27న వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ లోని రంగనాథ స్వామి ఆలయంలో ఆమెతో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక ఇప్పుడు ఆమెతో కలిసి ఏడు అడుగులు వేశారు. అతిధి రావు హైదరీ విషయానికి వస్తే.. 2002లో సత్యదీప్ మిశ్రా ను వివాహం చేసుకుంది. అతనితో పదేళ్లు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండి, 2012లో అతనితో విడాకులు తీసుకుంది. కొంతకాలం సినిమాకే పరిమితమైన ఈమె ఇప్పుడు మళ్లీ సిద్దార్థ్ తో కొత్త జీవితాన్ని పంచుకోబోతోంది. ఏది ఏమైనా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఈ జంటకు అభిమానులు , సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు