Actress.. మాతృత్వం.. వివాహం జరిగిన ప్రతి స్త్రీ కూడా కోరుకునే ఏకైక అనుభూతి.. ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో అమ్మ అనే పదానికి దూరం అవుతున్నారు. అయితే ఆల్టర్నేట్ గా సరోగసి, దత్తత లాంటి ఆప్షన్లు ఉన్నప్పటికీ కూడా కడుపున పుట్టిన బిడ్డపై చూపించే మమకారం మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా చాలామంది తమ బిడ్డ ఆలనా పాలన తామే చూసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మరికొంతమంది హీరోయిన్లు మాత్రం పిల్లలను కనడం ఇష్టం లేక సరోగసి పద్ధతిని ఫాలో అవుతుంటే, మరికొంతమంది పుట్టిన పిల్లలను చూసుకోవడానికి కూడా సమయం లేదు అంటూ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు.
నా కడుపున పుట్టిన పిల్లల్ని కూడా నేను మోయలేను..
అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం మరీ ఘోరంగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. తన కడుపున పుట్టిన పిల్లల్ని కూడా తాను మోయలేను అంటూ చెప్పడంతో అందరూ ఆమె ను విమర్శించడం మొదలుపెట్టారు. దీంతో ఈ విషయం విన్న చాలామంది కడుపున పుట్టిన పిల్లల్ని మోయడానికి కూడా బరువయ్యిందా అంటూ చాలా దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకు ఆమె ఏ పరిస్థితుల్లో ఈ విషయం చెప్పింది అనే విషయాలు ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.
ఆటో ఇమ్యూన్ సమస్యతో బాధపడుతున్న సెలీనా
ఆమె ఎవరో కాదు అమెరికన్ పాపులర్ సింగర్ , నటి, నిర్మాత సెలీనా గోమెజ్ (Selena Gomez). తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె నా గర్భాన్ని నేను మోయలేను అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈమె చాలాకాలంగా ఆటో ఇమ్యూన్ అనే వ్యాధితో బాధపడుతోందట. ఈ సమస్య కారణంగా గర్భం దాల్చడం సాధ్యం కాదని, ఈమె ఎమోషనల్ అవుతూ వెల్లడించింది. సెలీనా మాట్లాడుతూ.. ఈ విషయాన్ని నేను ఎప్పుడూ ఎవరితో కూడా వెల్లడించలేదు. అయితే దురదృష్టవశాత్తూ నా సొంత పిల్లల్ని కూడా నేను నా గర్భంలో మోయలేని పరిస్థితి ఏర్పడింది అంటూ దుఃఖితురాలయింది.
నా గర్భాన్ని కూడా మోయలేని పరిస్థితి..
నేను ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాను . ఒకవేళ నేను గర్భం దాలిస్తే. ఈ వ్యాధుల ప్రభావం నాపైన, నా బిడ్డ పైన చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా లూపస్ అనే వ్యాధితో నేను బాధపడుతున్నాను అంటూ బహిరంగంగా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఈ వ్యాధి వల్ల కిడ్నీలు కూడా చెడిపోయాయి. 2017లో కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. ముఖ్యంగా బై పోలార్ డిజాస్టర్ తో జీవించడం అంటే అంత సులభమేమి కాదు. బై పోలార్ కి నేను చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో సహజంగా గర్భాన్ని నేను మోయలేను. దీనికి తోడు నా గర్భం సురక్షితంగా ఉంటుందని కూడా నాకు అనిపించడం లేదు అంటూ బాధపడింది.
సరోగసి ద్వారా పిల్లల్ని కంటానంటున్న సింగర్..
అమ్మ అని పిలిపించుకోవడానికి నేను కూడా ఎంతో పరితపిస్తున్నాను. కానీ నాకు పిల్లలు పుట్టరని తెలిసి నేను మరింత ఎమోషనల్ అయ్యాను. నిజానికి సరోగసి లేదా దత్తత తీసుకోవడం అనే అంశాలపై ప్రస్తుతం ఆలోచిస్తున్నాను. ఇక ఈ విషయాలకు నా కుటుంబం ఒప్పుకున్నందుకు వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. నా గర్భాన్ని నేను నా ఆరోగ్య సమస్యల వల్ల మోయలేకపోవచ్చు కానీ సరోగసి లేదా దత్తత అనే పద్ధతులు నాకు మళ్ళీ అమ్మ అని పిలిపించుకునే అదృష్టాన్ని కలిగించాయి అంటూ తెలిపింది సెలీనా గోమెజ్.