Actress : అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది నటీమణులకు స్టార్ హీరోయిన్గా ఎదగడానికి కావాల్సిన లక్ మాత్రం ఉండదు. క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఎంపికైనప్పటికీ, ఇండస్ట్రిలో అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ కూసింత అదృష్టం లేక వరుస డిజాస్టర్లను అందుకుంటారు. తాజాగా ఓ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఐరన్ లెగ్ కు అడుగు దూరంలో ఉన్న ఈ హీరోయిన్ ఆశలన్నీ గోపీచంద్ పైనే పెట్టుకుంది. మరి గోపీచంద్ అయినా ఆమెకు ఈ ఫ్లాప్స్ నుంచి బ్రేక్ ఇస్తాడా? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
డేంజర్ జోన్ లో హీరోయిన్
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఎవరి గురించో కాదు యంగ్ హీరోయిన్ కావ్య థాపర్ గురించే. ఈ బ్యూటీ వరుస ఫ్లాప్‌లు అందుకోవడం అనేది ఆమె భవిష్యత్తును ప్రభావితం చేస్తోంది. ఇప్పటిదాకా కావ్య పదుల సంఖ్యలో సినిమాలలో నటించింది. కానీ అందులో చెప్పుకోదగ్గ హిట్స్ మాత్రం ఒకటి రెండే. ఆమె ఓటీటీ ప్లాట్ఫామ్లో డీసెంట్ రన్ చేసిన ‘ఏక్ మినీ కథ’తో మొదటి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత ‘ఊరు పేరు భైరవకోన’లో సెకండ్ హీరోయిన్గా చేసింది. కానీ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. మాస్ మహారాజ్ రవితేజతో ఆమె చేసిన ‘డేగ’ అది కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇన్ని ఫ్లాఫ్ ల మధ్య తమిళంలో చేసిన ‘బిచ్చగాడు 2’ కూడా కావ్యకు నిరాశనే మిగిల్చింది. దీంతో క్రేజీ హీరో రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘డబుల్ ఇస్మార్ట్’పై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రంలో ఆమె చాలా గ్లామరస్‌గా కనిపించింది. మూవీ రిలీజ్ కు ముందు మంచి బజ్ కూడా వచ్చింది. దీంతో ఈ మూవీ అయినా తన ఫేట్ ను మారుస్తుంది అని ఆశపడింది. అయితే ఆ సినిమా ఫ్లాప్‌గా నిలిచి ఆమె కెరీర్‌ని మరింత ప్రమాదంలో పడేసింది.
గోపీచంద్ చేతిలో ఆ హీరోయిన్ ఫ్యూచర్
ఇప్పుడు కావ్య ఆశలన్నీ ‘విశ్వం’ మూవీపైనే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్టోబర్ 11న విడుదలవుతున్న ఈ చిత్రం టీజర్‌కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. గోపీచంద్, శ్రీనువైట్ల ఇద్దరూ వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కావ్యా థాపర్‌కి కూడా ఈ సినిమా హిట్ కావాలి. ఇలా డైరెక్టర్, హీరోతో పాటు హీరోయిన్ కూడా ఒక్క ఛాన్స్ అంటూ హిట్ కోసం తహత్యహలాడుతున్నారు. కానీ ఇలా ఫ్లాఫ్ లో ఉన్న సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ అందరూ కలిసి ఓ సినిమా తీయడం అనేది నిజంగా రిస్క్ అనే చెప్పాలి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు డైరెక్టర్ శ్రీను వైట్ల, గోపీచంద్ కూడా ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. అంటే గోపీచంద్ పై ఇద్దరు హోప్స్ పెట్టుకున్నారు. మరి ఆయన తనతో పాటు వీరిద్దరి ఫేట్ ను విశ్వంతో మారుస్తాడా? అనేది వేచి చూడాల్సిందే.