Hema Drugs Case : టాలీవుడ్ లో ఇటీవల సంచలనం క్రియేట్ చేసిన ఘటన బెంగుళూరు రేవ్ పార్టీ.. ఈ పార్టీలో టాలీవుడ్ కు సంబందించిన సెలెబ్రేటీలు ఉన్నారని వార్తలు వినిపించాయి. అందులో టాలీవుడ్ యాక్టర్ హేమ ( Actor Hema ) ఉన్నట్లు పోలీసులు గుర్తించి ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే నేను ఆ పార్టీలో లేనని చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. ఆమెను నార్కోటిన్ పోలీసులు రిమాండ్ లో ఉంచారు. ఇటీవలే ఆమె వాదనను విన్న కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. కానీ తాజాగా ఈమెకు పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ఆ పార్టీలో ఈమె ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.. ఈమెకు ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రేవ్ పార్టీ గురించి నార్కోటిన్ పోలీసులు సంచలన విషయాలను బయట పెట్టారు.. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు ఆ పార్టీలో నటి హేమ ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా ఆధారాల ను సేకరించి అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా జత చేశారు. అయితే, ఇప్పటికే ఈ కేసులో మొత్తం 88 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. 1,086 పేజీల ఛార్జ్‌షీట్‌ను బెంగళూరు పోలీసులు దాఖలు చేశారు. మొన్నటివరకు నాకేం సంబంధం లేదనే వాదన వినిపించిన హేమకు ఇది కోలుకోలేని దెబ్బే.. ఆ తర్వాత పోలీసులు ఎలాంటి స్టెప్ ను తీసుకుంటారో అన్నది ఆసక్తిగా మారింది..
బెంగుళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ లో కలకలం రేపింది.. డ్రగ్స్ తీసుకున్నారనే అభియోగంతో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆమె ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కేసు నుంచి తనకు మినహాయింపునివ్వాలని ఆమె బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు షరతుల తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవ్ పార్టీ నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతో పాటు పార్టీలో డ్రగ్స్ వాడకంపై పోలీసులు వేసిన చార్జ్‌షీట్‌పై బెంగళూరు కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు డ్రగ్స్ కేసు పై బెంగుళూరు పోలీసులు విచారణ జరిపారు. మొత్తం లుక లుకలను బయటకు లాగారు.
ఈ క్రమంలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువైంది. దీంతో ఆమెను బెంగుళూరు పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సాక్ష్యాలు ఆమెకు వ్యతిరేకంగా ఉండటంతో జైలు శిక్ష తప్పదని తెలుస్తుంది. ఇక ఎన్నేళ్లు శిక్ష పడుతుంది అన్నది ఆసక్తిగా మారింది. ఈ వార్త వైరల్ అవ్వడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. మరి దీనిపై నటి హేమ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. ఈమెతో పాటుగా పలువురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారందరికీ విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపినట్లు తెలుస్తుంది.