Abhishek – Aishwarya.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా నిలిచిన అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan )- ఐశ్వర్యరాయ్ బచ్చన్(Aishwarya Rai Bachchan)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వీరిద్దరూ వృత్తిపరంగా ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉన్నా.. వ్యక్తిగతంగా ఏ రోజు కూడా విభేదాలకు పోలేదు. ఇక కూతురు ఆరాధ్య జన్మించిన తర్వాత ఆమే తమ లోకంగా జీవిస్తున్న జంటపై అనూహ్యంగా విడాకుల రూమర్లు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. గత కొన్ని వారాలుగా ఐశ్వర్యారాయ్ ,అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని, దీనికి కారణం అభిషేక్ బచ్చన్ తల్లి జయా బచ్చన్ అని, అత్త కోడళ్ళకి సరిపోకపోవడం పైగా అభిషేక్ బచ్చన్ తల్లి నుంచి బయటకు రాకపోవడం కారణంగా ఆమె అభిషేక్ కు విడాకులు ఇవ్వబోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఐశ్వర్య – అభిషేక్ బచ్చన్ మధ్య విభేదాలు..
దీనికి తోడు అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలలో కూడా ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో మాత్రమే కలిసి అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ వివాహానికి హాజరయింది. మరొకవైపు అభిషేక్ తన తల్లిదండ్రులతో హాజరయ్యాడు. దీంతో బచ్చన్ కుటుంబంతో వారి కోడలు కలవకపోవడంతో విడాకుల చర్చలకు మరింత ఆజ్యం పోసింది. దీనికి తోడు ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి ఒంటరిగా విదేశాల నుండి ఇండియాకి వచ్చిన క్రమంలో ఎయిర్పోర్ట్లో వీరిని రిసీవ్ చేసుకోవడానికి అభిషేక్ బచ్చన్ రాలేదు. దీంతో ఎప్పటికప్పుడు విడాకుల వార్తలు వైరల్ అయ్యాయి.
రూమర్స్ మధ్య జంటగా కనిపించిన ఐశ్వర్య – అభిషేక్..
అంతేకాదు మరొకవైపు తన చిన్ననాటి స్నేహితుడైన ఒక వ్యక్తితో ఐశ్వర్య చాలా క్లోజ్ గా మూవ్ అవుతుందని దీనికి తోడు గే డివోర్స్ పోస్ట్ కి అభిషేక్ బచ్చన్ లైక్ చేయడం అన్నీ కూడా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టం చేశాయి. అయితే ఇలా విడాకుల చర్చల మధ్య అభిషేక్ – ఐశ్వర్య తమ కుమార్తె ఆరాధ్యతో కలిసి దుబాయ్ విమానాశ్రయంలో కనిపించారు . ఈ వీడియోని సోషల్ మీడియా అభిమానుల పేజీలో షేర్ చేయడం జరిగింది. ఇందులో దుబాయ్ ఎయిర్పోర్ట్ అని కూడా రాసి ఉంది. దాంతో విడాకుల చర్చలు కేవలం పుకార్లు మాత్రమే వీరిద్దరూ ఇప్పటికే కలిసే ఉన్నారంటూ ఈ వీడియో అర్థమవుతుంది.
ఐశ్వర్య స్పందిస్తే రూమర్స్ కి చెక్..
నిజానికి ఈ వీడియో ఇప్పటిది కాదు. ఐశ్వర్య – అభిషేక్ కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో మనం కాస్త వెతికినట్లయితే ఫిబ్రవరి నెలలకు సంబంధించిన వీడియో అని తెలుస్తోంది. ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న ఈ వీడియో అప్పటిదే. ఒక వెకేషన్కు వెళ్లి ఐశ్వర్య , అభిషేక్ బచ్చన్ , ఆరాధ్య కలిసి బయటకు వచ్చారు. అప్పటి వీడియోని… అభిమానులు రూమర్స్ కి చెక్ పెట్టడానికి రిలీజ్ చేశారు. ఏది ఏమైనా ఐశ్వర్య దీనిపై స్పందిస్తే తప్పా ఈ రూమర్స్ ఆగవనే వార్తలు వినిపిస్తున్నాయి.
View this post on Instagram