5 Years For Falaknuma Das : అప్పుడే ఒక రా & రస్టిక్ దర్శకుడు పుట్టాడు

5 Years For Falaknuma Das : ఫలక్నామా దాస్ ఈ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వక్సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక గొప్ప దర్శకుడు దొరికాడు అనిపించుకున్నాడు. మలయాళం లో సూపర్ హిట్ అయిన అంగమలై డైలాగ్స్ అనే సినిమాని తెలుగులో అద్భుతంగా తీశాడు విశ్వక్సేన్. ఇంత గొప్ప దర్శకుడు ఉన్నాడా అని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. హైదరాబాద్ కల్చర్ ని, గ్యాంగ్స్ ని చాలా రా & రస్టిక్ గా ఇంట్రెస్టింగ్ గా చూపించాడు. నటుడును మించిన దర్శకుడు విశ్వక్ లో ఉన్నాడు అని నిరూపించిన సినిమా ఫలక్నామా దాస్.

ఫలక్నామా దాస్ కథ

ఈ కథ హైదరాబాదు లోని ఫలక్‌నుమా లోని దాస్ (విశ్వక్‌ సేన్‌) అనే కుర్రాడి చుట్టూ తిరుగుతుంది . దాస్‌ చిన్నప్పట్నుంచి ఆ ఏరియా లోని శంకర్ అనే దాదాని చూసి పెరుగుతాడు. పెద్దయ్యాక శంకర్ లా అవ్వాలని కలలు కంటాడు. చిన్నప్పుడే ఓ రౌడీ గ్యాంగ్ ను కూడా తయారు చేసుకుంటాడు. ఈ గ్యాంగ్ కు శంకర్ సహకారం కూడా ఇస్తాడు. స్కూల్ ఏజ్ లోనే శంకర్ గ్యాంగ్ తో తింటూ తిరుగుతూ సరదాగా గడిపేస్తుంటారు. కాలేజ్ లో అడుగుపెట్టాక ప్రేమ, గొడవలతో దాస్ జీవితం గడుస్తుండగా శంకర్ హత్యకు గురవుతాడు. రవి, రాజు అనే వ్యక్తులు శంకర్‌ను హత్య చేస్తారు.

శంకర్ హత్యతో గ్యాంగ్ ఒంటరి అయిపోతుంది. అప్పటి వరకు హాయిగా బతికిన ఈ గ్యాంగ్ కు కష్టాలు మొదలవుతాయి. వీటి నుంచి బయట పడటానికి వ్యాపారం చేద్దామని ఫలక్‌నుమా ప్రాంతంలోనే మటన్ షాప్ స్టార్ట్ చేస్తారు. అప్పటికే మాంసం వ్యాపారంలో రవి, రాజుదే పైచేయి ఉంటుంది. కానీ దాస్ వ్యాపారం ప్రారంభించాక చేశాక వారి వ్యాపారం తగ్గతుంది. దాస్ గ్యాంగ్ తమ వ్యాపారానికి అడ్డు వస్తుందని రవి, రాజు గొడవకు దిగుతారు. ఆ గొడవలో దాస్ మటన్ షాప్ పై నాటు బాంబు వేస్తారు. ఇక అప్పటి నుంచి మొదలైన గొడవలు ఓ హత్యకు దారి తీస్తాయి. దాస్ నాటు బాంబు విసరడంతో ఓ వ్యక్తి చనిపోతాడు. ఇక అప్పటినుంచి దాస్ జీవితం మారిపోతుంది. ఆ కేసు నుంచి బయట పడడానికి దాస్ గ్యాంగ్ చాలా ప్రయత్నిస్తుంది. చివరకు గ్యాంగ్ ఆ కేసు నుంచి బయట పడ్డాడా? బయటపడడానికి చేసిన ప్రయత్నాలేంటి? అనేది మిగతా కథ.

- Advertisement -

5 Years For Falaknuma Das

వివేక్ సాగర్ కీలకం

మొదటి రెండు సినిమాలతో గుర్తింపును సాధించుకొని మూడో సినిమాతో మరోసారి తన టాలెంట్ ని బయటపెట్టి చాలామంది దర్శకులను కూడా ఆశ్చర్యపరిచాడు. ఒక రీమిక్ సినిమాను ఇలా కూడా చేయొచ్చు అని విశ్వక్ ఆలోచనకు చాలా మంది ఫిదా అయిపోయారు. ఒకవైపు నటిస్తూ మరోవైపు అదే సినిమాకి దర్శకత్వం వహించడం అనేది కష్టతరమైన పని ఆ రెండిటిని సాధ్యమయ్యేలా చేసి తన కెరియర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే హిట్ సినిమాను కొట్టాడు నేటికీ ఆ సినిమా వచ్చి ఐదేళ్లయింది. ఈ సినిమాని విశ్వక్సేన్ ఎంత బాగా తెరకెక్కించాడో, తన మ్యూజిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో అంత బాగా వివేక్ సాగర్ ఎలివేట్ చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు