Shah Rukh Khan Manager Salary : కింగ్ ఖాన్ మేనేజర్ జీతం ఎంతో తెలుసా? హీరోయిన్ల కంటే ఎక్కువే!!

Shah Rukh Khan Manager Salary : షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ ఇప్పుడు చాలా ఫేమస్. కింగ్ ఖాన్ నీడలా ఉండే మేనేజర్ పూజా జీతం పెరుగుతూనే ఉంది. మరి పూజా రెమ్యూనరేషన్ తో పాటు ఆమె ఆస్తి ఎంతో తెలుసా?

పూజా దద్లానీ ఎవరు ?

షారుక్ నీడ వెన్నంటే ఉండే పూజా దల్లానీ ఆయన మేనేజర్. షారుఖ్ ఖాన్ సినీ కెరీర్‌లో అతని భార్య గౌరీ ఖాన్ ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో, మేనేజర్ పూజా దద్లానీ కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పూజా దల్లానీ ఒక మల్టీ మిలియనీర్‌ని వివాహం చేసుకుంది. ఇక పూజా ఎప్పుడూ షారుఖ్‌ నీడలా ఆయనతోనే ఉంటుంది. ఐపీఎల్ 2024 ట్రోఫీని షారుఖ్ జట్టు కేకేఆర్ గెలుచుకున్నప్పుడు కూడా పూజా షారుక్ తోనే ఉంది. నిజానికి ఆమె షారుక్ కుటుంబ సభ్యుల్లో ఒకరిలాగా మస్యలుకుంటుంది. షారూఖ్ పూజా జీవితంలో చాలా కష్ట సమయాల్లో ఆమెకు మద్దతుగా నిలిచాడు.

పూజ గత 12 ఏళ్లుగా షారుక్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. షారుక్, పూజ మధ్య మంచి స్నేహం ఉంది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. పూజా దద్లానీ బాయి అవాబాయి ఫ్రాంజీ పెటిట్ గర్ల్స్ హై స్కూల్, ముంబైలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో విద్యను అభ్యసించింది. మాస్ కమ్యూనికేషన్‌లో పట్టభద్రురాయలు అయ్యింది. పూజ హితేష్ గుర్నానీని 2008లో పెళ్లాడింది. హితేష్ వ్యాపారవేత్త. అతను లిస్టా జూల్స్ అనే కంపెనీకి డైరెక్టర్. ఇక ఈ జంటకు రీనా అనే కూతురు కూడా ఉంది.

- Advertisement -

जान लीजिए शाहरुख खान की मैनेजर पूजा ददलानी हैं कितनी अमीर, सलाना कमाई में  कई बड़े एक्टर्स से हैं आगेషారుక్ మేనేజర్ జీతం

స‌మాచారం ప్ర‌కారం పూజా ఏడాదికి 8 నుంచి 9 కోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటుంది. షారుక్ ఆమెకు నెలకు జీతం రూ.60 లక్షలు ఇస్తున్నాడు. అయితే ఆమె మొత్తం సంపద దాదాపు 45 నుంచి 50 కోట్లు ఉన్నట్టు సమాచారం. పూజా ఇటీవల ఓ విలాసవంతమైన ఇల్లు కూడా కొనుగోలు చేసింది. ఆ ఇంటి ఇంటీరియర్ వర్క్ ను గౌరీ ఖాన్ స్వయంగా చేసింది. షారుఖ్‌తో పాటు, ఆయన భార్య, ముగ్గురు పిల్లలతో కూడా పూజా నమ్మకంగా, స్నేహంగా ఉంటుంది.

అలాగ మేనేజర్ పూజా షారుక్ ఖాన్ సినిమాలు, అతని సినిమా రెమ్యూనరేషన్ వంటి విషయాలు కూడా చూసుకుంటుంది. షారుక్‌ నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంబంధిత పనులన్నీ పూజానే చూసుకుంటుంది. అంతే కాకుండా ఐపీఎల్ టీమ్ కేకేఆర్ నిర్వహణ బాధ్యత కూడా పూజా భుజస్కంధాలపైనే ఉంది.

ఆర్యన్ కేసులో కూడా

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో పూజా పేరు ప్రధానంగా వినిపించింది. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్టోబర్ 2021లో అరెస్టు చేసింది. ఈ సందర్భంగా ఆర్యన్‌ను కలిసేందుకు పూజా ఎన్‌సీబీ కార్యాలయానికి, కోర్టుకు వెళ్లడంతో పాటు మొత్తం కేసులో పూజా దద్లానీ ఎక్కువగా కనిపించింది. ఆర్యన్ జైల్లో ఉండగా పూజా, షారూఖ్ సపోర్ట్ చేశారు. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ వచ్చే వరకు పోరాడారు. పూజా దద్లానీ ధైర్యం, పోరాటాన్ని షారుక్ అభిమానులు అప్పట్లో బాగా మెచ్చుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు