Nandamuri Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1 న సినీ పెద్దలంతా కలిసి ఆయన గోల్డెన్ జూబ్లీని సెలెబ్రేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య 50 ఏళ్లకు సినీ కెరీర్ కి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలయ్యకు సంబంధించి ఎవరికి తెలియని విషయాలు, పాత వివాదాలు, రికార్డులు, ఆయన ఆస్తులు వంటి విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. అభిమానులు సైతం ఆయన గురించి మరింతగా తెలుసుకోవడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. ఇప్పుడు బాలయ్య దగ్గరున్న కార్ల కలెక్షన్ గురించి తెలుసుకుందాం పదండి.
బాలయ్య కార్ల కలెక్షన్
నందమూరి బాలయ్య నటుడిగా సినీ కెరీర్ ని ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు ఆయనను గోల్డెన్ జూబ్లీ వేడుక ద్వారా ఘనంగా సత్కరించడానికి భారీ ఏర్పాటు జరుగుతున్నాయి. సినీ పెద్దలంతా కలిసి పలువురు దిగ్గజ నటినటులను, రాజకీయ ప్రముఖులను గెస్ట్ లుగా ఆహ్వానిస్తూ, ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారధులంతా సెప్టెంబర్ 1న ఆయన గోల్డెన్ జూబ్లీ వేడుకకు హాజరు కాబోతున్నారు. అయితే నెల రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను డిజైన్ చేయించారు. ఇప్పటికే నటీనటులందరికీ ఆహ్వానం అందించారు. అయితే బాలయ్యకు సంబంధించిన అన్ని విషయాలు దాదాపుగా ఆయన అభిమానులందరికీ తెలుసు. కానీ బాలయ్య కార్ల కలెక్షన్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తాజా సమాచారం ప్రకారం పెద్దగా కార్లని ఇష్టపడని బాలయ్య దగ్గర దాదాపు 20 కోట్ల విలువైన లగ్జరీ కార్లు ఉన్నట్టుగా తెలుస్తోంది.
సరదా సరదాకే ఈ రేంజ్ కార్లు
ఇక ఆయన దగ్గర ఉన్న కార్ల కలెక్షన్ల విషయానికి వస్తే ఇటీవలే బాలయ్య ముద్దుల కూతురు బ్రాహ్మణి ఆయనకు బెంట్లీ కాంటినెంటల్ అనే కారుని గిఫ్ట్ గా ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. దీంతో కలిపి బాలయ్య గ్యారేజీలో మరో మూడు కార్లు ఉన్నాయి. అందులో ఒకటి మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 400d, మరొకటి బీఎండబ్ల్యూ 6 సిరీస్ జిటి, ఇంకోటి టయోటా ఇన్నోవా క్రిస్టా ఉన్నాయి. కార్లు పెద్దగా ఇష్టం లేని బాలయ్య సరదా సరదాకే ఈ లగ్జరీ కార్లను మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఆయనకు కార్ల పిచ్చి ఉండి ఉంటే ఆయన గ్యారేజ్ ఏ లెవెల్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్య ఆస్తుల విషయానికి వస్తే ప్రస్తుతం హైదరాబాదులో ఆయనకు రెండు విలాసవంతమైన ఇళ్ళు ఉన్నాయి. అంతేకాకుండా తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ వారసత్వంగా ఇచ్చిన వందల ఎకరాల భూములు కూడా ఉన్నాయి. హైదరాబాదులోని కొన్ని స్టూడియోలు, మూవీ థియేటర్లు కూడా బాలయ్య పేరు మీద ఉన్నట్టుగా సమాచారం. ఇక ప్రస్తుతం అందరి దృష్టి రేపు జరబోతున్న బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుక పైనే ఉంది.