Malavika Sharma : మాళవిక శర్మ అంటే అందరూ గుర్తు పట్టకపోవచ్చు. తెలుగులో అతి తక్కువ సినిమాలు చేసిన ఈ బ్యూటీ కొంతకాలం క్రితం రవితేజతో డేటింగ్ లో ఉన్నట్టు రుమార్లు వచ్చాయి. అయితే తాజాగా మాళవిక గురించిన ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకొచ్చింది. మరి అసలు ఆమె గురించి అసలు ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అంటే సెప్టెంబర్ 5న తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న గోట్ సినిమాలో ఆమె కూడా నటిస్తోంది. అందుకే మాళవికకు సంబంధించిన విషయాలను మూవీ లవర్స్ ఆరా తీస్తున్నారు. మరి ఆ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మాళవిక ఒక లాయర్.
క్రిమినాలజీలో క్వాలిఫైడ్ అడ్వకేట్
మాళవిక శర్మ మోడలింగ్ కెరీర్‌లో సక్సెస్ ఫుల్ అయ్యాక టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ముంబైకి చెందిన ఈ బ్యూటీకి వేదాంత్ శర్మ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. మాళవిక న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆమె ఒక క్వాలిఫైడ్ అడ్వకేట్. రిజ్వీ లా కాలేజీ నుండి ఆమె పట్టభద్రురాలయ్యారు. బ్యాచిలర్ ఆఫ్ లా పట్టా పొందిన ఈ అమ్మడు అర్హత కలిగిన న్యాయవాది. అలాగే ఆమె ఓవైపు శనిమాలు చేస్తూనే మరోవైపు LL.M కూడా చదువుతున్నారు.
మాళవిక మోడల్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆమె ఇప్పటిదాకా ఫోన్, బ్యూటీ ప్రోడక్ట్స్ తో పాటు అనేక ఇతర బ్రాండ్‌లతో సహా పలు కమర్షియల్ యాడ్ లలో నటించింది. మాళవిక శాస్త్రీయ నృత్య రూపం కథక్‌లో కూడా శిక్షణ పొందింది. ఆమె రాజేంద్ర చతుర్వేది వద్ద శిక్షణ పొందింది. ఇక 2018లో నేల టిక్కెట్టు సినిమాతో తెరంగేట్రం చేసింది. రామ్ పోతినేనితో కలిసి రెడ్, కాఫీ విత్ కాదల్, భీమా, హరోమ్ హర అనే సినిమాలు కూడా చేసింది. కానీ ఈ సినిమాలేవీ పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. మాళవిక ఇప్పుడు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌లో తలపతి విజయ్‌తో కలిసి నటించనుంది. మరి విజయ్ అయినా ఆమె ఫేట్ ను మారుస్తాడా అనేది తెలియాలంటే గోట్ మూవీ రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ అండ్ సీ.
రవితేజతో డేటింగ్ రూమర్స్
మాళవిక శర్మ ఒక లాయర్ అయినప్పటికీ టాలీవుడ్ లో గాసిప్ ల బారిన పడక తప్పలేదు. తన ఫస్ట్ తెలుగు మూవీ నేల టిక్కెట్టుతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న ఈ ముంబై మోడల్ మాస్ మహారాజా రవితేజతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆమె స్టేటస్ సింగిల్ అని తెలుస్తోంది. ఆ రూమర్లపై ఇటు రవితేజ గానీ, అటు మాళవిక గానీ ఇప్పటిదాకా స్పందించలేదు. సినిమా ఇండస్ట్రిలో ఇవన్నీ కామన్. కానీ హిట్ లేకపోతే మాత్రం కన్పించకుండా పోయే ప్రమాదం ఉంది. గోట్ తో మాళవిక ఆ గండాన్ని గట్టెక్కాలి అని కోరుకుందాం.