Guess The Actress : రాజేంద్ర ప్రసాద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన ఈ హీరోయిన్‌ను గుర్తు పట్టారా..?

Guess The Actress : ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ? ఒకప్పుడు సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ సినిమాలో బాల నటిగా నటించింది. ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. తమిళ నటి అయినప్పటికీ తెలుగులోనూ నటించి మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆమె తండ్రి ఒకప్పటి హీరో. అలాగే తన మేనత్త కూడా మంచి నటి. మరి ఇంకా ఈ హీరోయిన్ ఎవరో మీరు గెస్ చేయలేకపోతే అసలు విషయంలోకి వెళ్దాం పదండి.

ఆ హీరోయిన్ ఎవరంటే ?

ఆ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ మరెవరో కాదు ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం మంచి నటిగా రాణిస్తున్న ఐశ్వర్య నేడు స్థాయికి చేరుకోవడానికి వెనుక ఓ కన్నీటి గాథ ఉంది. ఈ బ్యూటీ తండ్రి రాజేష్ 80 లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు. అయితే ఐశ్వర్యకు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తండ్రి రాజేష్ అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటికి బాగానే ఆస్తిపరులు ఐశ్వర్య కుటుంబం. కానీ ఆమె తండ్రి చనిపోగానే బంధువులు ఆస్తిని కరిగించేశారు. సేవా కార్యక్రమాలు, తండ్రి ఆసుపత్రి ఖర్చులు పోనూ మిగిలిన ఆస్తి అలా బంధువుల పాలైంది. ఆమె తల్లి ముగ్గురు పిల్లల్ని తీసుకుని రోడ్డున పడింది. అప్పుల వాళ్ళు ఇంటి మీద పడ్డారు. దీంతో చెన్నైలో ఉన్న ఇంటిని అమ్మేసి ఓ అద్దె ఇంట్లో నలుగురు ఉండేవారు.

Aishwarya-Rajesh-latest – Actor, Actress Images, News

- Advertisement -

ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో తన ఇద్దరు సోదరులను కోల్పోయింది ఈ అమ్మడు. దీంతో చిన్న వయసులోనే కుటుంబం బాధ్యత నెత్తిన వేసుకుని చైల్డ్ ఆర్టిస్టుగా ప్రారంభించిన ఐశ్వర్య ప్రస్తుతం హీరోయిన్ గా అదరగొడుతోంది. నిజానికి ఐశ్వర్య రాజేష్ యాంకర్ గా కెరియర్ ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఓ తమిళ రియాలిటీ షోలో విజేతగా నిలిచి సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలిగిపోతున్నప్పటికీ ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడింది. ఏదేమైనా అన్ని అడ్డంకులను దాటుకుని ఇప్పుడు వరుస సినిమాలతో అదరగొడుతోంది ఐశ్వర్య రాజేష్.

ఆ ఫోటోలో ఉన్నది ఈ సినిమాలోనే..

ఇక ఆ ఫోటో విషయానికి వస్తే అప్పటి మూవీ లవర్స్ టక్కున గుర్తు పడతారు. కానీ ఇప్పటి జనరేషన్ కు పెద్దగా తెలియక పోవచ్చు. 1995లో రాజేంద్ర ప్రసాద్ చేసిన రామబంటు అనే సినిమాలో ఓ పాటలో కనిపించింది ఐశ్వర్య.

ఐశ్వర్య రాజేష్ తెలుగు సినిమాలు

కోలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఐశ్వర్య తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి, మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ అనే సినిమాలలో నటించింది. ఇక ఈ బ్యూటీ నటించిన ఫర్హాన, డియర్, డ్రైవర్ జమున వంటి సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యాయి. తాజాగా ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు