Prabhas : టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరే కాదు.. వాంటెడ్ హీరో కూడా.. ఆయనతో సినిమాలు చెయ్యాలని డైరెక్టర్స్ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సౌత్ లో అందరికన్నా ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకడు ప్రభాస్.. ప్రభాస్ ఈ మధ్య వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. అంటే చాలా డబ్బులను సంపాదిస్తున్నాడు.. మరి ఆ డబ్బులను ఏం చేస్తాడు అన్నది చాలా మందికి ప్రశ్నగా మిగిలింది.. అయితే ప్రభాస్ ఆ ఆస్తిని ఎక్కడ దాచి పెట్టాడో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ప్రభాస్ కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.. సినిమా సినిమాకి పారితోషకం పెంచుకుంటున్నారు కదా మరి ఆ డబ్బునంత ఎక్కడ పెడుతున్నారు అంటూ అభిమానులు సైతం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. బాహుబలి తర్వాత డార్లింగ్ నటిస్తున్న సినిమాలకు ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం హనురాఘవపూడితో సినిమాతో పాటు భవిష్యత్తులో చేయబోయే సినిమాల కోసం కూడా తన పారితోషకం పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది..
ఇకమీదట డార్లింగ్ తో సినిమాలు చెయ్యాలంటే మాత్రం అంత ఈజీ కాదు.. ఒక్కో సినిమాకు రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని ఇండస్ట్రీలో టాక్.. ఆయన అడిగినంత ఇవ్వడానికి మేకర్స్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు బాగానే సంపాదించిన డార్లింగ్ ఆ డబ్బులను ఎక్కడ పెట్టారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. తన సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్లో పెడుతున్నట్లు సమాచారం రీసెంట్గా ఇటలీలో ఒక ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశారట. ముంబై లోను హైదరాబాద్ లోని ప్లాట్లు కొన్నట్లు తెలుస్తుంది. అలాగే తన సొంతం ఊరిలో కూడా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.. ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇప్పుడు ఆయన నటిస్తున్న రాజాసాబ్ సినిమాపైనే అందరి ఆసక్తి ఉందని తెలిసిందే..