Bollywood : ప్రియురాలితో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న హీరోయిన్

Bollywood : హీరోయిన్ల జీవితాలు తెరపై కన్పించినంత ఈజీగా ఏం ఉండవు. ముఖ్యంగా లవ్ లైఫ్ కొంతమందికి తీరని వేదనను మిగులుస్తుంది. ఆ మరిచిపోలేని గాయాలను మదిలో పెట్టుకుని జీవితాంతం ఒంటరిగా బతకలనే నిర్ణయం తీసుకున్న స్టార్స్ ఎంతోమంది. అందులో జెన్నిఫర్ వింగెట్ కూడా ఒకరు. హిందీ బుల్లితెరపై బలమైన పాత్రల్లో కనిపించే టాప్ నటి జెన్నిఫర్ వింగెట్ ఎవరో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదనే చెప్పాలి. టెలివిజన్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఆమె కూడా ఒకరు. రంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ.. పర్సనల్ లైఫ్ లో పెద్ద షాక్ తగిలి ఇప్పుడు సింగిల్ గా ఉంది.

చిన్న వయసులోనే పెళ్లి

నటి జెన్నిఫర్ వింగెట్ టెలివిజన్‌లోని అగ్ర నటీమణులలో ఒకరు. సీరియల్ ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. తన వ్యక్తిగత జీవితంలో చాలా కష్టమైన సమయాలను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె ఎన్నడూ చలించలేదు. విడాకుల తర్వాత 39 సంవత్సరాల వయస్సులో కూడా ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. జెన్నిఫర్ వింగెట్ తన పాత్రలతో అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది. ఆమె స్టైల్, యాక్టింగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘బేహద్’ సీరియల్‌లో ఈ బ్యూటీ చేసిన పాత్రను జనాలు ఎప్పటికీ మరచిపోలేరు. జెన్నిఫర్ తన కెరీర్‌లో ‘దిల్ మిల్ గయే’, ‘బేహాద్’, ‘కహిన్ తో హోగా’, ‘బేపన్నా’ వంటి అనేక ప్రముఖ టీవీ షోలలో నటించింది. ఈ పాత్రల ద్వారా పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న జెన్నిఫర్  వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. జెన్నిఫర్ వింగెట్ చాలా చిన్న వయస్సులో కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. ఇద్దరూ ఓ టీవీ సీరియల్‌లో కలిశారు. ఇద్దరూ ఒకే సీరియల్‌లో నటించేవారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మొదటి భార్య శ్రద్ధా నిగమ్‌తో 2008లో విడాకులు తీసుకున్న తర్వాత అతను జెన్నిఫర్ వింగెట్‌ను వివాహం చేసుకున్నాడు.

Happened for the best': Karan Singh Grover on divorces with Jennifer Winget and Shraddha Nigam

- Advertisement -

మోసం చేసిన భర్త.. ఏకంగా మూడు పెళ్ళిళ్ళు

ఈ జంట వైవాహిక బంధం ఒక సంవత్సరం కొనసాగలేదు. కరణ్, జెన్నిఫర్ విడాకులు తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జెన్నిఫర్‌ను భర్త మోసం చేశాడు. పెళ్ళయి ఏడాది కూడా గడవక ముందే మరో అమ్మాయితో ఎఫైర్ నడిపాడు. జెన్నిఫర్ మాజీ భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌ను తన ప్రియురాలితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరి పెళ్లి తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో జెన్నిఫర్‌ అందరి ముందు కరణ్‌ని చెప్పుతో కొట్టినట్లు చెప్పుకుంటారు. ఇంకేముంది ఈ జంట ఏడాది కూడా కాకముందే విడాకుల బాట పట్టారు. 10 నెలల్లోనే విడాకులు కూడా వచ్చేశాయి. కరణ్ సింగ్ గ్రోవర్ ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే ఈ నటి మాత్రం ఇంకా రెండో పెళ్లి చేసుకోలేదు. జెన్నిఫర్ ఇప్పటికీ ఒంటరిగా జీవిస్తోంది. 39 ఏళ్ల నటి రెండో పెళ్లి గురించి ఆలోచించలేదు. అలాగే తనకు తగిన జోడీ కోసం వెతకలేదు. మరి లైఫ్ లాంగ్ ఆమె ఇలాగే ఉండిపోతుందా? అనేది అభిమానుల ప్రశ్న.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు