Ram Gopal Varma : ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన అంశం రాజ్ తరుణ్ (Raj Tarun), లావణ్య (Lavanya )ల యవ్వారం.. హీరో రాజ్ తరుణ్ తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిద్దరి కేసులో పలు సెన్సేషనల్ టాపిక్స్ బయటపడటంతో ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది తప్పా.. ఓ కొలిక్కి రావడం లేదు. రాజ్ తరుణ్ తనను 11 ఏళ్లుగా వాడుకున్నాడని మాల్వి మల్హోత్రా వల్ల దూరం పెడుతున్నాడని లావణ్య సంచలనం సృష్టించింది. ఈ కేసు ఇప్పటికి ఎన్నో మలుపులు తిరిగింది. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ప్రముఖ దర్శకుడు ఇటీవల రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma ) ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. లావణ్యపై షాకింగ్ కామెంట్ చేశారు. ఆ ఇంటర్య్వూలో ముందుగా మాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మాయిపై కాస్టింగ్ కౌచ్ పై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా అవకాశం ఇస్తానని మోసం చేస్తే సదరు వ్యక్తిపై కేసు పెట్టాలి గానీ, ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పుబడితే ఎలా ? అన్ని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో మాఫీయా లాంటివి ఏం ఉండవు. అమ్మాయిలను టార్గెట్ చేయాలని ఎవరూ టార్గెట్స్ పెట్టుకోరు. అమ్మాయి కూడా ఇష్టం ఉంటే.. అలాంటి దారుణాలు జరుగుతాయి.. ఇక లావణ్య లాంటి పెళ్ళాం ఉంటే ఏ మగాడైనా చచ్చిపోతాడని బాంబ్ పెల్చాడు.
అంతేకాదు గతంలో లావణ్యపై ప్రశంసలు కురిపించాడు. ఇప్పుడేమో అమ్మాయి ని దారుణంగా తిట్టినట్లు తెలుస్తుంది. ఆ అమ్మాయి అనే మాటాలు, చేసే ఆరోపణలు మామూలుగా లేవు. అది ఇది అంటూ మీడియాను కూడా ఆగం ఆగం చేస్తుంది. ఇంతవరకూ రాజ్ తరుణం కేసు పెట్టిందో కూడా అర్థం కావడం లేదు. ఈ విషయంలో కూడా మీడియా వింతగా వ్యవహరిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసు పై మీడియా మొదట చెప్పిన మాటను మీడియానే మరిచిపోతుంది. మార్చేస్తోంది.’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.. మొత్తానికి వర్మ అన్న మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల పై లావణ్య ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..