Hanu Raghavapudi- Prabhas: అందాల రాక్షసి(Andala Rakshasi) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హను రాఘవపూడి. మొదటి సినిమాతోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. అయితే హనుకి లవ్ స్టోరీలు బాగా తెరకెక్కిస్తాడు అనే పేరు ఉంది. ఇకపోతే నాని హీరోగా కూడా కృష్ణ గాడి వీర ప్రేమ కథ అనే సినిమాను చేశాడు హను. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. వీరి కాంబినేషన్లో మళ్లీ సినిమా వస్తుంది అని చాలాసార్లు ఇద్దరు అనౌన్స్ చేశారు.
ఇకపోతే నాని కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాను అంటూ చాలా సందర్భాల్లో చెప్పాడు. అయితే హను రీసెంట్గా సీతారామం(SitaRamam) అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఒక సందర్భంలో ఈ కథను మొదట నానితో చేయాలి అని అనుకున్నారా అంటూ ఒక ఫిలిం జర్నలిస్ట్ హను ను క్వశ్చన్ చేశారు. దానికి సమాధానంగా హను మాట్లాడుతూ అది కంప్లీట్ గా డిఫరెంట్ స్టోరీ. అది సెకండ్ వరల్డ్ వార్ టైం లో జరిగే కథ అంటూ అప్పుడు ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు.
ఇక ప్రస్తుతం హను రాఘవపూడి(Hanu Raghavapudi) ప్రభాస్ హీరోగా సినిమాలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి Fouji అనే టైటిల్ కూడా ఖరారులో ఉంది. అయితే హను ఈ సినిమా గురించి పోస్ట్ చేస్తూ 1940లో కథను జరగబోతున్నట్లు రివిల్ చేశాడు. అయితే అదే టైంలో సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. అయితే దీనితో చాలామందికి ఇది మొదటి ప్రభాస్ చేయాల్సిన సినిమా కాదు నానితో అనుకున్న కదా అని ఒక క్లారిటీ వచ్చింది.
ఇకపోతే ప్రభాస్(Prabhas) హీరోగా సిద్ధార్థ ఆనంద్(Siddarth Anand) దర్శకుడిగా సినిమా చేయాలని మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయించుకున్నారు అయితే సిద్ధార్థ ఆనంద్ తో ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) కి సినిమా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. అయితే హను నానితో చేయాల్సిన ఈ కథను పెద్ద హీరోతో వెళ్దాం అంటూ దర్శకుడు సిద్ధార్థ కోసం తీసుకున్న డేట్స్ ను హను కోసం కేటాయించి ఈ సినిమాను పూర్తి చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది.