Vishwak Sen : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మాస్ కా దాస్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఆల్రెడీ గామి తో హిట్ కొట్టిన విశ్వక్, గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో యావరేజ్ సినిమాని అందుకున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా క్రేజీ సినిమాలు చేయబోతున్నాడు విశ్వక్ సేన్. ఏకంగా ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు మాస్ కా దాస్. ఈ లైనప్ చూస్తుంటే చూస్తుంటే సరికొత్త విశ్వక్ సేన్ ని టాలీవుడ్ లో ప్రెజెంట్ చేస్తారని అనిపిస్తుంది. ప్రస్తుతం యంగ్ హీరోలలో ఎక్కువ సినిమాలు ఒకేసారి చేస్తుంది విశ్వక్ సేన్ అనే అనిపిస్తుంది.
విశ్వక్ సేన్ క్రేజీ లైనప్..
ఇక విశ్వక్ సేన్ రీసెంట్ గా “లైలా” పేరుతో ఓ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ నటిస్తుండడం విశేషం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలవగా, ఈపాటికే సగం షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఇక దీని కంటే ముందు మొదలైన “మెకానిక్ రాకీ” సినిమా దీపావళి రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాను రవితేజ ముళ్ళపూడి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. అలాగే శ్రీధర్ గంట అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తన 13వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ కాప్ గా నటించనున్నాడు. ఇక రీసెంట్ గా అనుదీప్ కెవి దర్శకత్వంలో ఓ సినిమా ని అనౌన్స్ చేసాడు విశ్వక్ సేన్. మెకానిక్ రాకీ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.
ఈ సినిమాలతో వాళ్ళకి పోటీ ఇస్తాడా?
ఇక విశ్వక్ సేన్ ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టగా, ఈ ఇయర్ ఎండింగ్ లో మెకానిక్ రాకి రిలీజ్ అవుతుండగా, నెక్స్ట్ ఇయర్ మూడు సినిమాలు రిలీజ్ అవుతాయి. అయితే మాస్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ హీరో, టైర్ 2 హీరోలకి రెగ్యులర్ గా పోటీ ఇవ్వలేకపొతున్నాడు. టైర్ 2 లో ముందుగా నాని, విజయ్ దేవరకొండ, సాయి దుర్గా తేజ్, వరుణ్ తేజ్, నిఖిల్, నితిన్ వంటి హీరోలు ముందుండగా, వీళ్ళకి పోటీ ఇవ్వాలంటే ఈ సినిమాలు సరిపోవని అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే విశ్వక్ కంటే డబుల్ రేంజ్ లో వాళ్ళ మార్కెట్ ఉండగా, ఈ సినిమాల్లో ఒక్క సినిమా అయినా వంద కోట్ల రేంజ్ లో వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. మరి చూడాలి విశ్వక్ సేన్ రాబోయే సినిమాల్లో ఏ సినిమాతో ఈ రికార్డ్ కొడతాడో.