Vijay DevaraKonda : ముందుగా సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు సత్యదేవ్. ఆ తర్వాత హీరోగా కూడా సినిమాలు చేశాడు. సత్యదేవ్(Satya Dev) టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సత్యదేవ్ వాయిస్ తన యాక్టింగ్ తనకి చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలి. సత్యదేవ్ హీరోగా ఎన్ని సినిమాలు చేసినా కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద సరిగ్గా వర్కౌట్ కాలేదు. అవసరమైనంత టాలెంట్ ఉన్నా కూడా సరైన బ్రేక్ ఇచ్చే సినిమా ఒకటి కూడా ఇప్పటివరకు రాలేదు. ఇక కొన్ని సినిమాల్లో కీలకపాత్రలు కూడా పోషిస్తున్నాడు సత్యదేవ్.
రౌడీ హీరోతో ఢీకొంటాడా
వివేక్ ఆత్రేయ(Vivek Athreya) దర్శకత్వం వహించిన బ్రోచేవారెవరు రా సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు సత్యదేవ్. ఆ సినిమాలో దర్శకుడు పాత్రను పోషించిన సత్యదేవ్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా నటించి మరోసారి తన టాలెంట్ ను ప్రూవ్ చేశాడు. ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న సినిమాలో సత్యదేవ్ ఒక కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో సత్యదేవ్ విలన్ పాత్రలో కనిపిస్తాడా, రౌడీ హీరోతో ఢీకొంటాడా అని సినీ విశ్లేషకులు ఆలోచనలో పడిపోయారు.దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
విజయ్ నెవెర్ బిఫోర్ లుక్
ఇక ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా ఫస్ట్ లుక్ కూడా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకుముందు ఎప్పుడూ కనిపించిన విధంగా విజయ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో సత్యదేవ్ తో పాటు తమిళ్ హీరో ధృవ్ విక్రమ్ కూడా కనిపిస్తాడు అని వార్తలు వినిపించాయి. ఈ సినిమాకి అనిరుద్(Anirudh) సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నాగ వంశీ(Naga Vamsi) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఏదేమైనా సత్యదేవ్ కి హీరోగా చేసిన సినిమాలో వర్కౌట్ అవ్వకపోయినా కూడా కొన్ని సినిమాల్లో కీలకపాత్రలు మాత్రం మంచి ఇమేజ్ తీసుకొచ్చి పెడుతున్నాయి. మరి ఈ సినిమాలోని క్యారెక్టర్ ఎంత మేరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.
ఇక సత్యదేవ్ హీరోగా చేసిన సినిమాలలో బ్లఫ్ మాస్టర్(Bluff Master), ఉమామహేశ్వర ఉగ్రరూపస్య(Umamaheswara Ugrarupasya) ఈ రెండు సినిమాలు మాత్రం కొద్దిపాటి గుర్తింపును తీసుకొచ్చాయి. కాకపోతే ఈ రెండు రీమేక్ సినిమాలు. సత్యదేవ్ తో హీరోగా ఒక హిట్ సినిమా చేసి ప్రూవ్ చేసుకోవాలని చాలామంది దర్శకులు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఒక హీరోకి కావలసిన అన్ని లక్షణాలు సత్యదేవ్ దగ్గర ఉన్నాయి. అయితే వాటన్నిటిని పర్ఫెక్ట్ గా వాడుకొని సినిమా చేస్తే అది ఖచ్చితంగా హిట్టయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న చాలామంది సక్సెస్ఫుల్ హీరోలలో తను కూడా సక్సెస్ఫుల్ హీరో అవుతాడా.? లేదంటే సీనియర్ నటుడు బ్రహ్మాజీలా కీలకపాత్రలకు పరిమితం అవుతాడా వేచి చూడాలి.