Vijay Devarakonda – Rashmika : మళ్లీ దొరికేశారు… కల్కి విషయంలో అడ్డంగా బుక్ అయిన లవ్ బర్డ్స్

Vijay Devarakonda – Rashmika : చాలా రోజుల నుంచి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోంది అంటూ రూమర్లు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలాసార్లు వీరిద్దరూ విడివిడిగా పోస్ట్ చేసిన ఫొటోల ద్వారా దొరికిపోయారు. తాజాగా మరోసారి కల్కి విషయంలో అడ్డంగా బుక్ అయ్యారు. మరి ఈసారి ఏం చేశారంటే?

కల్కిపై విజయ్ దేవరకొండ కామెంట్స్

యావత్ భారతీయ సినీ ప్రపంచం కల్కి 2898 ఏడీ ఫీవర్ తో ఊగిపోతోంది. తలైవర్ రజనీకాంత్, ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అడివి శేష్ వంటి దిగ్గజ నటీనటులు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో కల్కి మూవీపై మరింత హైప్ పెరిగి, కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీసును ర్యాంప్ ఆడిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కూడా కల్కిని చూశామన్న ఇంట్రస్టింగ్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ ఇద్దరూ థ్రిల్ ఫీల్ అయ్యామని ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.

కల్కి 2898 ఏడీలో అతిధి పాత్రలో కనిపించిన దేవరకొండ తాజాగా వెండి తెరపై ఈ సినిమాను చూశాక తర్వాత తన భావాలను పంచుకున్నారు. “ఇప్పుడే సినిమా చూశాను. ఏం చెప్పాలో తెలియట్లేదు.. కల్కి 2898 ఏడీ భారతీయ సినిమాకు ఒక ల్యాండ్‌మార్క్. భారతీయ సినిమా కొత్త స్థాయి అన్‌లాక్ చేయబడింది” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేవరకొండ ఈ భారీ మల్టీ-స్టారర్ చిత్రానికి తన శుభాకాంక్షలు తెలియజేస్తూ “ఇది 1000 కోట్లు అంతకంటే ఎక్కువ వసూలు చేస్తుందని నేను ఆశిస్తున్నాను” అంటూ ఒక లవ్ ఎమోజీని షేర్ చేశారు.

- Advertisement -

థ్రిల్ అయిన రష్మిక మందన్న

ఇక కల్కి మూవీని వీక్షించిన రష్మిక మందన్న “ఓ మై ఫ్రీకింగ్ గాడ్! నాగ్ అశ్విన్ మీరు అందమైన జీనియస్! ఇన్క్రెడిబుల్!! టీమ్ లోని అందరికీ అభినందనలు. ఈ చిత్రం అందరి ప్రేమకు అర్హమైనది. మన పౌరాణిక దేవుళ్లను తెరపై సజీవంగా చూడటం ఇందులో నాకు ఇష్టమైన భాగం. అమేజింగ్!” అంటూ రాసుకొచ్చింది రష్మిక మందన్న.

రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ (PC: Rashmika Mandanna Instagram)

ఇద్దరూ కలిసే చూశారా?

అయితే అటు రష్మిక, ఇటు విజయ్ దేవరకొండ ఇద్దరి పోస్ట్ లు చూశాక కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇద్దరూ సినిమాను చూశామంటూ ఒకే టైమ్ లో పోస్ట్ చేశారు. ఒక్క క్షణం కూడా గ్యాప్ లేకపోవడంతో ఈ రూమర్డ్ లవ్ బర్డ్స్ ఒకేసారి కలిసి సినిమాను వీక్షించారని, అందుకే ఇలా ఒకేసారి మూవీ ఎలా ఉందో తెలుపుతూ పోస్ట్ చేశారని అంటున్నారు. దీంతో మరోసారి విజయ్, రష్మిక జంట అడ్డంగా దొరికిపోయినట్టు అయ్యింది. కానీ ఏ థియేటర్లో రష్మిక, విజయ్ సినిమాను చూశారు అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. కాగా కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. మొత్తానికి వీరిద్దరూ సినిమా బాగుందంటూ షేర్ చేసిన ఇన్స్టా స్టోరీస్ వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు