Varalakshmi Sarath Kumar : నికోలాయ్ ఇన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చి వరలక్ష్మిని పడేశాడా? వజ్రాలు, బంగారం… లిస్ట్ పెద్దదే

Varalakshmi Sarath Kumar : ప్రముఖ నటుడు శరత్‌ కుమార్ కుమార్తె వరలక్ష్మి నికోలాయ్ సచ్‌దేవ్ అనే వ్యాపారవేత్తకు రెండవ భార్యగా మారిన విషయం తెలిసిందే. అయితే నికోలాయ్ వరలక్ష్మికి ఇచ్చిన బహుమతులు ఇప్పుడు మరో చర్చకు దారి తీశాయి.

భార్యకు కానుకల వర్షం

నికోలాయ్ తన రెండవ భార్య వరలక్ష్మికి ముంబైలో 200 కోట్ల రూపాయల బంగ్లాను ఇప్పటికే కొనుగోలు చేసినట్టు సమాచారం. అలాగే ఆయన వరలక్ష్మికి బంగారు చెప్పులు, వజ్రాలు పొదిగిన చీర, బంగారు, వజ్రాభరణాలను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడని టాక్ నడుస్తోంది. ఇంత విలాసవంతమైన కానుకలతో వరలక్ష్మి కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అంతకంటే ముందే డబ్బుల కోసమే వరలక్ష్మి ఆల్రెడీ పెళ్ళయి, విడాకులు తీసుకున్న వ్యక్తిని పెళ్ళాడుతోంది అనే విమర్శలు విన్పించాయి.

కలిసొచ్చిన రీఎంట్రీ

వరలక్ష్మి శరత్‌ కుమార్ తమిళ చిత్రసీమలో అగ్రనటిగా నిలదొక్కుకోలేకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన అత్యద్భుతమైన నటనను కనబరిచి అభిమానులను ఆకట్టుకుంటోంది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 2013 చిత్రం బోడ బోడిలో శింబు సరసన నటించి, ఆమె తమిళంలో అడుగు పెట్టింది. మొదటి చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో తమిళంలో అవకాశాలు లేకపోవడంతో తెలుగు, కన్నడ, మలయాళం వంటి దక్షిణ భారత భాషల్లోకి మారిన వరలక్ష్మి, ఆ తర్వాత బాలా దర్శకత్వం వహించిన ధార తాపట్టా చిత్రం ద్వారా తమిళ చిత్రసీమలో రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తరువాతే వరలక్ష్మికి ఆఫర్లు మొదలయ్యాయి. ముఖ్యంగా రవితేజతో వరలక్ష్మి చేసిన క్రాక్ ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది.

- Advertisement -

వ్యాసం_చిత్రం7

విశాల్ తో ప్రేమాయణం, పెళ్ళికి దూరం

వరలక్ష్మి గతంలో ప్రముఖ నటుడు విశాల్‌తో చాలా సంవత్సరాలు ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి. అయితే తరువాత నటుల యూనియన్ సమస్య కారణంగా శరత్‌ కుమార్, విశాల్‌ల మధ్య మనస్పర్థలు రావడంతో విశాల్ వరలక్ష్మితో విడిపోయిందని అంటారు. తర్వాత వరలక్ష్మి తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. గత మార్చిలో ఆమె తన 14 ఏళ్ల స్నేహితుడైన నికోలాయ్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించి, ఎంగేజ్‌మెంట్ ఫోటోను షేర్ చేసింది. అయితే నికోలాయ్‌కి అప్పటికే కవిత అనే మోడల్‌తో వివాహమై, విడాకులు కూడా తీసుకున్నారు. అతనికి 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఈ వార్త వరలక్ష్మి అభిమానులను షాక్ కి గురి చేసింది.

పెళ్ళికి తల్లి దూరం

అయితే తన పెళ్లి గురించి, భర్తపై వస్తున్న విమర్శలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వరలక్ష్మి శరత్‌కుమార్ జూలై 3న తన ప్రేమికుడినే పెళ్లాడింది. శరత్‌ కుమార్ మొదటి భార్య, వరలక్ష్మి తల్లి సాయాదేవి ఈ పెళ్లికి రాలేదని, దీనికి వరలక్ష్మి కారణం కావచ్చని అంటున్నారు. అదేవిధంగా చెన్నై తాజ్ హోటల్‌లో వీరి పెళ్లి జరగగా, లీలా ప్యాలెస్ హోటల్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా సూపర్ సస్టార్ రజినీకాంత్ తనదైన శైలిలో స్టెప్పులేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు