Urvashi Rautela : షూటింగ్ లో గాయపడిన బాలయ్య హీరోయిన్… గాయాలతో హాస్పిటల్లో

Urvashi Rautela : బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా తన సినిమాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కారణాలతో కూడా తరచుగా వార్తలలో నిలుస్తుంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో ఊర్వశి గాయపడి, ఆసుపత్రి పాలైనట్లు వార్తలు వస్తున్నాయి. విషయమేమిటో తెలుసుకుందాం పదండి.

గాయాలతో ఆసుపత్రి పాలైన ఊర్వశి

నటి ఊర్వశి రౌతేలా నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్రం ‘NBK 109’లో హీరోయిన్ గా కనిపించబోతోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ గా నటిస్తుండగా, దుల్కర్ అతిథి పాత్రలో కన్పించబోతున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది నవంబర్ లో మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మూడవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

మీడియా కథనాల ప్రకారం హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్‌లోనే ఊర్వశి గాయపడినట్టు తెలుస్తోంది. తీవ్రమైన ఫ్రాక్చర్ కావడంతో ఆసుపత్రిలో చేరిందని అంటున్నారు. ఊర్వశి టీం విడుదల చేసిన ప్రెస్ స్టేట్‌మెంట్‌లో ఆమెకు తీవ్రస్థాయిలో ఫ్రాక్చర్ అయ్యిందని పేర్కొంది. ఇప్పుడు ఊర్వశి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, డాక్టర్స్ ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్నారని వెల్లడించారు. హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఆమెకు ఫ్రాక్చర్ అయ్యిందని, అప్పటి నుంచి ఆమెకు నొప్పిగా ఉందని ఊర్వశి బృందం వెల్లడించింది.

- Advertisement -

77th Festival de Cannes: Urvashi Rautela sets a new world record, dons the  biggest ball gown ever in history designed specially by Tunisian fashion  designer Souhir El Gabsi

ఈ వార్తలు నిజమేనా?

ఊర్వశి ఇటీవల ‘NBK 109’ మూడవ షెడ్యూల్ షూటింగ్ కోసం హైదరాబాద్‌కు బయలుదేరింది. అంతలోనే ఆమె గాయపడింది అన్న వార్తా వైరల్ అవుతోంది. అయితే ఊర్వశి హెల్త్ అప్‌డేట్‌తో పాటు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఊర్వశి ఆసుపత్రి నుండి ఎటువంటి ఫోటో లేదా వీడియోను షేర్ చేయలేదు. దీంతో అసలు ఈ వార్తలు నిజమా? లేక ఫేక్ రూమర్సా అనేది క్లారిటీ లేదు. కానీ అవి ఊర్వశి అభిమానులఅను మాత్రం తెగ టెన్షన్ పెడుతున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ఊర్వశి కిట్టిలో ఉన్న సినిమాలు

2015 లో మిస్ యూనివర్స్ గా నిలిచిన ఊర్వశి తెలుగు, హిందీ భాషల్లో ఇప్పటిదాకా కేవలం ఐటెం సాంగ్స్ కు మాత్రమే పరిమితం అయ్యింది. స్టార్ హీరోయిన్స్ ను మించే అందం, పాపులారిటీ ఉన్నప్పటికీ ఆమె హీరోయిన్ గా ఎందుకు నటించట్లేదు అంటే పారితోషికం కోసమే అంటారు. ఒక్క సినిమాలో నటిస్తే వచ్చే రెమ్యూనరేషన్ ను ఒక్క పాటతో సంపాదించే పవర్ ఉంటుంది ఐటం సాంగ్స్ కు. ఈ ఏడాది ప్రథమార్థంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో వేర్ ఈజ్ ది బాస్ పార్టీ అనే సాంగ్ తో తెలుగు తెరకు పరిచయమైంది ఊర్వశి రౌతేలా. చిరంజీవి పక్కన అదిరిపోయే స్టెప్స్ వేసిన ఈ బ్యూటీ అందం చూసి ఊర్వశి రౌతేలా టాలీవుడ్ పాగా వేయడం కన్ఫామ్ అని అందరూ అనుకున్నారు. అయితే ఊహించినట్టుగానే ఊర్వశి వరుస టాలీవుడ్ అవకాశాలతో దుసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో NBK 109 చేస్తోంది. అవినాష్ 2 అనే ప్రాజెక్టు కూడా ఆమె కిట్టిలో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు