Puri Jagannadh: ముందుకు వెళ్తే నుయ్యి ఈ వెనక్కి వస్తే గొయ్యి అన్నట్టుంది పూరి జగన్నాథ్ (Puri Jagannadh) పరిస్థితి. ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమా అంటేనే విపరీతమైన క్రేజ్ ఉండేది కానీ ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమా అంటే చాలామంది ఆశలు వదిలేసారు. పూరి స్టామిన తెలిసిన కొంతమంది మాత్రమే పూరి జగన్నాథ్ సినిమాలు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి దర్శకుడికి సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కామన్ గా జరుగుతుంది. పూరి జగన్నాథ్ విషయానికి వస్తే ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను చేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను స్టార్ హీరోలకు అందించారు.
ఒక పూరి జగన్నాథ్ నుంచి చివరగా వచ్చిన చిత్రం లైగర్(Liger). ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉండేవి. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు ఈ కలెక్షన్ల ప్రస్తావన తీసుకొస్తూ ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మాట్లాడుతూ నేను 200 కోట్లు నుండి లెక్క పెడతాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ కాన్ఫిడెన్స్ చూడగానే చాలామంది ఈ సినిమా ఖచ్చితంగా 500 కోట్లకు పైగా వసూలు చేస్తుంది అని బిలీవ్ చేశారు. కానీ సినిమా బ్రేక్ ఇవ్వని కూడా కాలేదు. సినిమా వలన చాలామంది నష్టపోయారు.
అయితే ఆ నష్టాన్ని పూడ్చమని ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ధర్నాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం పూరీ జగన్నాథ్ టీం 80 కోట్లు కడితే గాని సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితిలో లేదు ఇప్పటికిప్పుడు అన్ని క్లియర్ చేసి ఆ సినిమాను రిలీజ్ చేయాలి. 80 కోట్లు అంటే మామూలు విషయం కాదు పూరి జగన్నాథ్ తన లైఫ్ టైంలో ఒకేసారి ఇంత అమౌంట్ ని కోల్పోయాడు. ఈ అమౌంట్ ని ఒక్కరోజులో కట్టాలంటే మామూలు విషయం కాదు. అయినా కూడా విశ్వ ప్రయత్నాలు చేసి ఈ సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పూరి జగన్నాథ్ డబల్ ఇస్మార్ట్(Double Ismart) శంకర్ సినిమా కోసం ముంబై వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే ముందు ఈ సినిమాకి చుట్టుకున్న సమస్యలు తీరాలి. సినిమా రిలీజ్ అయినంత వరకు కూడా ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఈ సినిమాకి పోటీగా మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు ఈ సినిమాకు అన్నీ కలిసి వస్తున్నాయి. ఏం జరుగుతుందో రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ రానుంది.