Star Heroine : టాలీవుడ్, కోలివుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తుంపు తెచ్చుకుంది చెన్నై బ్యూటీ త్రిష ( Trisha ).. 40 ఏళ్లు వయసు వచ్చినా కూడా చెక్కు చెదరని అందంతో కుర్రకారుకు మతి పోగొడుతుంది. ఈ వయస్సు కూడా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తూ ఖాళీ లేకుండా గడుపుతుంది. సౌత్ లో హైయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్రస్ గా సత్తా చాటుతోంది. అటువంటి త్రిష తన ఇంటిని ఒక సీనియర్ స్టార్ హీరోకు అమ్మేసిందట. బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న త్రిష ఇంటిని ఎందుకు అమ్మేసింది. అప్పులు ఉన్నాయా? లేదా ఆ హీరోకు ఈమెకు ఏదైన యవ్వారం జరుగుతుందా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ త్రిష ఇల్లు అమ్మిన ఆ హీరో మరెవరో కాదు యాక్షన్ చిత్రాలకు పెట్టిందిపేరైన నటుడు భాను చందర్.. అయితే వీరిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉందట.. ఆయనకు ఇప్పుడు కాదు ఎప్పుడో ఇల్లు అమ్మయిందట.. చెన్నై నుంచి టాలీవుడ్ హైదరాబాదుకు షిఫ్ట్ అయినా కూడా కొందరు నటీనటులు చెన్నైలోనే ఉండిపోయారు. అలాంటివారిలో భానుచందర్ ఒకరు. ప్రస్తుతం చెన్నైలో భాను చందర్ ఉంటున్న ఇల్లు త్రిష దే.. ఈ విషయాన్ని భాను చందర్ (Bhanu Chandar ) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పటిలో ఆ వీడియో ఓ రేంజులో వైరల్ అయ్యింది. ఆ ఇంటిని తమకు నచ్చినట్లు మార్చినట్లు తెలుస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్ త్రిష ఇండస్ట్రీలో అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులవి. ఆ టైమ్ లో త్రిష తండ్రికి వ్యాపారం లో పెట్టుబడి పెట్టడానికి డబ్బు అవసరమై రావడంతో ఆస్తులు అమ్ముకుంది. నటుడు భాను చందర్ కు ఇంటిని అమ్మడం జరిగింది. ఆ తర్వాత త్రిష ఇంటిని భాను చందర్ సతీమణి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఒకప్పటికీ ఇప్పటికి చాలా మారిపోయిందని, చుట్టు పూల తోటలు పెంచినట్లు ఆయన చెప్పాడు. ఇక త్రిష ఎప్పుడూ బయట కనిపించిన మా ఇల్లు ఎలా ఉందని అడుగుతుందని భాను ఆయన చెప్పారు. గతంలో త్రిష బెడ్రూం, ఇప్పుడు తన బెడ్రూం అయిందని తెలిపారు. త్రిష ఇల్లు తమకు బాగా కలిసొచ్చిందని కూడా ఆయన అన్నారు. కాగా, భాను చందర్ కు త్రిష అమ్మేసిన ఇంటి విలువ ప్రస్తుతం రూ. 8 కోట్లు ఉంటుందని సమాచారం..
ఇక త్రిష సినిమాల విషయానికొస్తే.. త్రిష ఈ వయస్సులో కూడా స్టార్ హీరోయిన్ గా రానిస్తుంది. స్టార్ హీరోలకు చాయిస్ త్రిష.. ఇటు తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అటు తెలుగులో కూడా సినిమాలు చేస్తుంది. ఇక ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.