Trisha: స్టార్ హీరోయిన్స్ ని వెనక్కి నెట్టిన బ్యూటీ.. బాలీవుడ్ హీరోయిన్స్ కూడా కుళ్లుకునేలా..?

Trisha.. సౌత్ సినీ పరిశ్రమలో హీరోల పారితోషకం ప్రస్తుతం రూ.100 కోట్లకు చేరుకున్నప్పటికీ.. చాలామంది హీరోయిన్ల పారితోషకం కనీసం రూ.8 కోట్లు కూడా దాటలేదు అనే వాదన ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది.. కానీ ఈ మధ్యకాలంలో సినిమా బడ్జెట్ పెరిగిపోవడం, హీరోల పారితోషకం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో హీరోయిన్లు కూడా తమ పారితోషకం విషయంలో డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే చాలామంది 10 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. నిజానికి రూ .10కోట్ల రెమ్యునరేషన్ అంటే బాలీవుడ్ హీరోయిన్స్ కి మాత్రమే చెందుతుంది. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఈ రేంజ్ లో నయనతార(Nayanatara )తప్ప ఎవరూ అంత పారితోషకం తీసుకోలేదు. అయితే ఇప్పుడు నయనతార పారితోషకమును కూడా బ్రేక్ చేసి ఒక హీరోయిన్ ఏకంగా 12 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటూ నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.

Trisha: The beauty that pushed star heroines back.. Will Bollywood heroines also be spoiled..?
Trisha: The beauty that pushed star heroines back.. Will Bollywood heroines also be spoiled..?

ఆమె ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha).. 40 సంవత్సరాలు దాటినా.. ఇంకా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నటి త్రిష అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది. ఇటీవల పొన్నియన్ సెల్వన్ ,లియో వంటి చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా విశ్వంభర సినిమాలో చిరంజీవి సరసన నటిస్తోంది.

నయనతార..

- Advertisement -

నిన్న మొన్నటి వరకు సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్లలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఈమె ఇప్పుడు త్రిష వచ్చిన తర్వాత నెంబర్ 2 స్థానానికి దిగజారింది . ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు రూ.10కోట్ల వరకు పారితోషకం తీసుకుంటోంది.

శ్రీనిధి శెట్టి..

కేజిఎఫ్ చిత్రంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె, విక్రమ్ సరసన కోబ్రా సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.7 కోట్లు పారితోషకం అందుకుంటోంది.

రష్మిక మందన్న..

నేషనల్ క్రష్ గా పేరుపొందిన రష్మిక మందన్న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో బిజీగా నటిస్తోంది. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ .5 కోట్లు తీసుకుంటున్న ఈమె తాజాగా పుష్ప 2 చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

పూజా హెగ్డే..

అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్స్ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న ఈమె, ఒక్క చిత్రానికి రూ .5కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది. ప్రస్తుతం సూర్య 44 చిత్రంలో హీరోయిన్గా ఎంపికయింది.

తమన్నా..

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె ఒక్కో చిత్రానికి రూ .5 కోట్ల పారితోషకం తీసుకున్నప్పటికీ, ఒక సినిమాలో ఐదు నిమిషాలు స్పెషల్ సాంగ్ చేసింది అంటే చాలు రూ.1 కోటి డిమాండ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది.

సమంత:

ప్రస్తుతం బాలీవుడ్ లో ఈమె ఒక్కో సినిమాకు రూ .8కోట్ల రూపాయలు పారితోషకం తీసుకుంటున్నప్పటికీ టాలీవుడ్ కి వచ్చేసరికి కేవలం ఒక్కో సినిమాకు రూ .5కోట్ల వరకు మాత్రమే పారితోషకం అందుకుంటోంది.

ఇక అనుష్క శెట్టి రూ .4కోట్లు, కీర్తి సురేష్ రూ .3కోట్లు, సాయి పల్లవి రూ .2కోట్లు పారితోషకం తీసుకుంటున్నారు.

Trisha.. సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుని త్రిష ప్రస్తుతం ఎక్కువ చిత్రానికి రూ.12 కోట్లు డిమాండ్ చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు