Tollywood Heroine.. తెలుగు సినిమా బ్రతికి ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్మరణీయం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మూల స్తంభంగా నిలిచిన అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswar Rao) నేడు మన మధ్య లేకపోయినా ఆయన తీసుకొచ్చిన ఈ తెలుగు సినీ పరిశ్రమ ఎంతోమందికి అండగా నిలిచింది. వేలాదిమంది కార్మికులు ఒక్క ఈ సినిమా పరిశ్రమ ద్వారానే బ్రతుకుతున్నారు అనడంలో సందేహం లేదు. నాడు ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి దిగ్గజాలు సినీ పరిశ్రమ కోసం కష్టపడ్డారు కాబట్టే నేడు తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నత స్థాయికి చేరుకుంది. అలా సినిమా ఇండస్ట్రీకి మూలకారకుడైన ఏఎన్ఆర్ ను ఒక హీరోయిన్ అహంకారంతో అవమానించడం నిజంగా తెలుగు సినిమానే అవమానించినంత పనైంది అంటూ నెటిజన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి వచ్చిన మీనా..
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన క్యూట్ స్మైల్ తో, అందచందాలతో అప్పట్లో ఎంతో మందిని ఆకట్టుకున్న మీనా (Meena)ఆ తర్వాత ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది. రమ్యకృష్ణ , సౌందర్య , నగ్మా, రంభ లాంటి హీరోయిన్లు స్టార్ పొజిషన్ లో కొనసాగుతున్న సమయంలో కూడా మీనా కు వరుస అవకాశాలు తలుపుతట్టాయి. ఇకపోతే అందులో కొన్ని తల్లి కారణంగా వదులుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అక్కినేని నాగేశ్వరరావును ఈమె అవమానించిందట. అక్కినేని నాగేశ్వరరావు, మీనా కాంబినేషన్లో వచ్చిన చిత్రం సీతారామయ్య గారి మనవరాలు (Sitaramaih gaari manavaralu).
అహంకారంతో ఏఎన్ఆర్ ను అవమానించిన మీనా..
ఈ సినిమా షూటింగ్ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు అంటే పెద్దగా తెలియని మీనా.. ఆయనను చాలా చులకనగా చూసేదట. ఆయన షూటింగ్ సెట్లోకి వస్తే , అక్కడున్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా లేచి నిలబడితే, మీనా మాత్రం కాలి మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చుండేదట . అయితే చాలాసార్లు ఈమె ప్రవర్తన గమనించిన అక్కినేని నాగేశ్వరరావు ఒకరోజు దగ్గరకు పిలిచి.. ఇదిగో అమ్మాయి.. నువ్వు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టావు. పెద్దవారికి మర్యాద ఇవ్వకుండా అమర్యాదగా ప్రవర్తించావంటే నీకు సినిమాలలో అవకాశాలు కూడా రావు. అహంకారంతో నీకు కళ్ళు మూసుకుపోతే ఒకసారి కళ్ళు తెరిచి చూడు.. ఎవరికీ ఎలా గౌరవం ఇవ్వాలో తెలుసుకో అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇండస్ట్రీలోని వ్యక్తులతో ఎలా మసులుకోవాలో ఆమెకు చెప్పారట.
తప్పు తెలుసుకొని క్షమాపణ..
అయితే నాగేశ్వరరావు చెప్పిన తర్వాత ఎమోషనల్ అయిన మీనా ఆ తర్వాత ఆయన బ్యాక్ గ్రౌండ్ ను పూర్తిగా తెలుసుకొని, ఆ తర్వాత సెట్ లో అందరి ముందు ఆయనకు క్షమాపణలు చెప్పిందట. అలా తన తప్పు తెలుసుకొని మళ్లీ నాగేశ్వరరావు దగ్గరకు వచ్చి ఆయనను క్షమాపణలు కోరిందని సమాచారం. అంతేకాదు అప్పటి నుంచి ఏఎన్ఆర్ ఎప్పుడు ఎక్కడ కనిపించినా గౌరవంతో నమస్కారం చేసేదట మీనా. ఏది ఏమైనా తెలియక చేసిన తప్పు మళ్ళీ సరిదిద్దుకొని తనను తాను స్టార్ హీరోయిన్ గా మార్చుకుంది. మొత్తానికైతే మీనా నేడు స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.