Tollywood Heroine.. ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీ అనే కాదు దాదాపు అన్ని ఇండస్ట్రీలలో కూడా హీరోయిన్ లకి లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు హీరోయిన్స్. ఒక్కొక్కసారి సక్సెస్ లభించింది అంటే అవకాశాలు వరుసగా తెలుపుతడుతాయి. కానీ దురదృష్టవశాత్తు ఒక సినిమా ఏదైనా డిజాస్టర్ గా నిలిచిందంటే మాత్రం ఇక ఆ హీరోయిన్ ని పట్టించుకునే నాధుడే ఉండడు. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం ఏకంగా వరుసగా 9 సినిమాలు అట్టర్ ప్లాప్ అయినా ఆమెకు మాత్రం ఒక్కో సినిమాకి ఏకంగా రూ.11 కోట్ల రూపాయలు పారితోషకం ఇచ్చి మరీ ఆమెను తమ సినిమాలలో పెట్టుకుంటున్నారు. ఇంతకు ఆమె ఎవరు? ఆమెకు ఎందుకింత డిమాండ్? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి మోడల్ గా ప్రయాణం..
ఆమె ఎవరో కాదు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను. 1987 ఆగస్టు 1న ఢిల్లీలో జన్మించిన ఈమె కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన ఈమె నటన పైన ఆసక్తితో కొంతకాలం మోడల్ రంగంలోకి అడుగుపెట్టి, అదే సమయంలో రిలయన్స్ ట్రెండ్స్, రెడ్ ఎఫ్ఎం 93.5 యూనిస్టైల్ ఇమేజ్ , కోకో – కోలా, మోటోరోలా, పివిఆర్ ఎస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వంటి బ్రాండ్లకు ప్రచారం చేసింది. ఆ తర్వాత మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మంది నాదం సినిమాతో తొలిసారి తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమయ్యింది.
బాలీవుడ్ కి మకాం మార్చిన తాప్సీ..
ఆ తర్వాత మొగుడు, వీర , గుండెల్లో గోదారి, షాడో వంటి చిత్రాలలో నటించింది కానీ ఏ చిత్రం కూడా ఈమెకు పెద్దగా గుర్తింపును అందివ్వలేదు. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో కూడా నటించింది తాప్సి. ఇక ఈ సినిమా తర్వాత ఈమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ డేవిడ్ ధావన్ హాస్య చిత్రమైన చష్మే బద్దూర్ అనే హిందీ చిత్రంతో హిందీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాకి మొదట ప్రతికూల సమీక్షలు వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.ఆ తర్వాత మరికొన్ని చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
వరుసగా 9 ఫ్లాప్ లు.. కానీ ఒక్కో చిత్రానికి రూ.11 కోట్లు..
ఇకపోతే ఈమె తన 11 ఏళ్ల బాలీవుడ్ కెరియర్లో మొత్తం తొమ్మిది సినిమాలలో నటించింది కానీ సోలో హీరోయిన్గా ఈమెకు ఒక విజయం కూడా వరించలేదు. అయినా సరే అవకాశాలు తలుపు తడుతున్నాయి.ఇక షారుక్ ఖాన్ తో డంకీ సినిమా కోసం ఏకంగా రూ.11 కోట్లు తీసుకుంది. ఏదేమైనా వరుస డిజాస్టర్లు తలుపు తట్టినా సరే ఈమెకు ఏకంగా రూ .11 కోట్లు పారితోషకం ఇచ్చారంటే.. ఈమె డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రూ.10 కోట్ల విలువైన బంగ్లాలో ఉంటున్న ఈమె, తన కార్ల విలువ సుమారుగా రూ.46 కోట్లు ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈమె తన డైట్ కోసమే నెలకు లక్ష రూపాయలు ఖర్చు చేస్తోందని సమాచారం.