Prasanth Varma : ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సినిమాలల్లో హనుమాన్ కూడా ఒకటి.. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma ) డైరెక్టర్ గా తెరకెక్కించారు.. తేజా సజ్జా హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో వచ్చింది. హనుమాన్ స్టోరీ కొత్తగా ఉండటంతో ప్రేక్షకులు ఈ మూవీకి నిరాజనం పలికారు. ఒకటి, రెండు కాదు ఏకంగా 300 కోట్లకు పైగా రాబట్టింది.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది.. ఇక మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడం తో సెకండ్ పార్ట్ ను ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా గురించి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ గురించి ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
“జై హనుమాన్ “మూవీ..
హనుమాన్ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో సీక్వెల్ ను ప్లాన్ చేశారు. ఇటీవల ప్రశాంత్ వర్మ స్పెషల్ గ్లింప్స్ కూడా షేర్ చేశారు. చుట్టూ అందమైన కొండలు.. మధ్యలో నది.. ఎంతో ఆహ్లాదమైన వాతావరణాన్ని చూపిస్తూ వెల్ కమ్ టు అంజనాద్రి 2.0 అంటూ పోస్ట్ చేశారు. జై హనుమాన్ హ్యాష్ ట్యాగ్ కూడా యాడ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లోని రఘునందన సాంగ్ అటాచ్ మెంట్ తో వచ్చిన వీడియో వైరల్ అయ్యింది. ఇక 2025 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు మేకర్స్ తీసుకొస్తారని ఆ మధ్య వార్తలు జోరుగా వినిపించగా.. ఇప్పుడేమో 2026లో జై హనుమాన్ రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇక ఇటీవలే నిరంజన్ రెడ్డి తప్పుకోవడంతో, మైత్రీ మూవీ మేకర్స్ మూవీని నిర్మించనుందని టాక్ నడుస్తోంది..
ప్రశాంత్ వర్మ బుద్ది చూపించాడు..
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకేక్కించిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ సినిమా రానుందని అనౌన్స్ చేశారు. అయితే సినిమా వచ్చి ఏడాది కావొస్తున్న కూడా ఆ సినిమా గురించి ఆలోచన లేదు. కానీ కొత్త సినిమాలను వరుసగా అనౌన్స్ చేస్తున్నాడు. అయితే ఈయన గురించి ఓ షాకింగ్ విషయం బయటపడిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలు అనౌన్స్ చేసిన వెంటనే డబ్బులను తీసుకుంటున్నాడట.. దానయ్య – అధీర, మహేష్ మేనల్లుడు వాసిక నందన సినిమా కోసం డబ్బులు తీసుకున్నాడు. అలాగే మైత్రీ వాళ్ల నుంచి జై హనుమాన్ కోసం.. ప్రైమ్ షో నుంచి కూడా వసూల్ చేసినట్లు టాక్.. ఇప్పటివరకు అనౌన్స్ చేసిన సినిమాలు పూర్తి అవ్వలేదు కానీ కొత్త సినిమాను లైన్లో పెడుతున్నాడు. సినిమా స్టార్ట్ అయ్యే ముందే ప్రొడ్యూసర్ల నుంచి డబ్బులు తీసుకుంటాడు.సినిమాకు అయ్యే బడ్జెట్ మొత్తం ముందే తీసుకుంటాడు అనే టాక్. ఈ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. మరి దీనిపై ప్రశాంత్ వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి..