The GOAT : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా ‘ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం’ సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేయగా, రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ సాంగ్ మాత్రం బాగా ట్రోల్ అవుతుంది. ఆ సాంగ్ లో విజయ్ డాన్స్, అలాగే లుక్స్ ట్రోల్ అవుతున్నాయి. కానీ దాన్ని మరిపించేలా నెక్స్ట్ సాంగ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గోట్ కి సంబంధించి తాజాగా క్రేజీ న్యూస్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.
ఊహించని రికార్డ్ కి మేకర్స్ ప్లాన్…
అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం విజయ్ గోట్ సినిమా మేకర్స్ ఓ క్రేజీ రికార్డు కోసం ప్లాన్ చేస్తున్నారట. అదేంటంటే తమిళనాడు లో గోట్ సినిమా రిలీజ్ అయ్యే రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి థియేటర్లో విజయ్ గోట్ సినిమానే ప్రదరించాలని ప్లాన్ చేస్తున్నారట. పైగా ఆ రోజు అన్ని థియేటర్లలో కూడా ఆరుకి పైగా షోలు ప్లాన్ చేస్తున్నరట. గతంలోనే లియో కి ఈ రికార్డ్ సెట్ చేద్దామని ప్లాన్ చేసినా కుదరలేదు. కానీ ఇప్పుడు ఎలాగైనా ఈ రికార్డ్ సెట్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. కానీ ఇది జరగాలంటే గత వారంలో అంతకు ముందు రిలీజ్ అయిన సినిమాలన్నీ తీసేయాలి. అలా జరగాలంటే ఇతర చిత్రాల నిర్మాతలు ఒప్పుకోవాలిగా. మరి గోట్ మేకర్స్ వాళ్ళతో మాట్లాడి ఎలా సెటిల్ చేస్తారో చూడాలి.
సెప్టెంబర్ 5కి భారీ రిలీజ్..
ఇక విజయ్ నటిస్తున్న ది గోట్ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 5న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించడం జరిగింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ది గోట్ సినిమాలో జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ కాగా, వచ్చే వారం నాలుగో పాట రిలీజ్ కి ప్లాన్ చేస్తునట్టు సమాచారం.