Thalapathy Vijay : దలపతి విజయ్ ఇటీవలే ది గోట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు తమిళంలో తప్ప మిగతా ఎక్కడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సింపుల్ గా చెప్పాలంటే ది గోట్ మూవీ తెలుగులో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా మిగిలింది. దీంతో ఈ సినిమా రిజల్ట్ ను పక్కన పెట్టిన ఆయన అభిమానులు విజయ్ చివరి సినిమాపై ఫోకస్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఫ్లాఫ్ ఇచ్చిన హీరోయిన్ తోనే విజయ్ రొమాన్స్ చేయబోతున్నాడు అనే వార్త తాజాగా బయటకు వచ్చింది.
ప్లాఫ్ హీరోయిన్ తో విజయ్ రిస్క్ చేస్తున్నాడా?
కోలీవుడ్ స్టార్ విజయ్ తన దృష్టిని పూర్తిగా రాజకీయాలపైకే మళ్లించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే కొన్నిరోజుల క్రితం ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేసి, సినిమాల నుంచి తప్పుకుంటాను అంటూ అభిమానులకు షాక్ ఇచ్చే ప్రకటన చేశారు. అయితే అప్పటికే విజయ్ ది గోట్ మూవీ చేయడానికి సిద్ధం అయ్యారు. ఆ తరువాత విజయ్ మరొక్క మూవీని మాత్రం చేసి, సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాడని ప్రచారం జరిగింది. ఆ వార్తల నడుమ రీసెంట్ గా ది గోట్ మూవీ రిలీజ్ కావడంతో పాటు భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక తమిళ రాజకీయాలకు పూర్తిగా అంకితం కాబోతున్న విజయ్ అంతకంటే ముందు మరో సినిమా చేయనున్నాడు. డైరెక్టర్ హెచ్ వినోద్‌తో తన చివరి సినిమాను కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ మూవీలో హీరోయిన్ కోసం వేట సాగుతుండగా, ఓ ఫ్లాప్ హీరోయిన్ తో మేకర్స్ సంప్రదింపులు జరుగుతున్నట్టు టాక్ నడుస్తోంది.
బజ్ ప్రకారం ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో కథానాయికగా నటించడానికి మేకర్స్ పూజా హెగ్డేతో చర్చలు జరుపుతున్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డే కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. తాజా సమాచారం ప్రకారం విజయ్ చివరి చిత్రంలో హీరోయిన్ రోల్ కోసం మేకర్స్ అనుకుంటున్న పేర్లలో పూజా హెగ్డే పేరు ముందుంది. మేకర్స్ ఆమెకే మొదటి ప్రాధాన్యతను ఇచ్చి, విజయ్ సరసన నటింపజేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఆల్రెడీ ఫ్లాఫ్ ఇచ్చిన హీరోయిన్ తో విజయ్ చివరి సినిమా చేయడం అంటే రిస్క్ చేస్తున్నాడా? అని టెన్షన్ పడుతున్నారు ఆయన అభిమానులు. కాగా ఈ చిత్రానికి విజయ్ రూ. 220 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇది ఆయన కెరీర్ లోనే అందుకుంటున్న అత్యధిక పారితోషికం. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమవుతుంది.
పూజాకు గోల్డెన్ ఛాన్స్
పూజా హెగ్డే ప్రస్తుతం సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది. మరి విజయ్ చివరి సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించనుంది అంటూ వస్తున్న వార్తలు గనుక నిజమైతే పూజాకు ఇది గోల్డెన్ ఛాన్స్ అవుతుంది. ఆమెకు ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పెద్దగా అవకాశాలు లేవు. సూర్యతో మాత్రం ఓ మూవీ చేస్తోంది.